అంచనాలను మించి భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద వద్ద చెడుగుడు ఆడిస్తోంది. మొదటి రోజే చాలా కేంద్రాల్లో రికార్డులు సృష్టించి వసూళ్ల పరంగా సంచలనాలు నమోదు చేస్తోంది. ఏపిలో కఠిన నిబంధనలు, పరిమిత షోలు, టికెట్ రేట్ల ఆంక్షలు ప్రభావితం చూపడం ఏ మేరకు నష్టం తెస్తుందనే దాని మీదే ఇప్పుడే అంచనాకు రాలేం. రెగ్యులర్ ప్రైజ్ తో అమ్మడం ప్రేక్షకుల కోణంలో మంచి పరిణామమే అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు ఎంతకు కొన్నారనేది లాభనష్టాలను నిర్ణయించనుంది. కొన్ని చోట్ల […]
అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న నాంది తాలుకు ప్రమోషన్ వేగమందుకుంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ లో కీలక భాగం పూర్తి చేసిన యూనిట్ ఇప్పుడు తుది మెరుగులు దిద్దే పనుల్లో బిజీగా ఉంది. గత కొంత కాలంగా హిట్స్ లేక కొంచెం గ్యాప్ తీసుకుని మహేష్ బాబు మహర్షితో మంచి కంబ్యాక్ ఇచ్చిన నరేష్ నాందితో తనలోని కొత్త కోణాన్ని చూస్తారని నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా వదిలిన ఇందులోనూ యాక్టర్స్ లుక్స్ ఇప్పుడు హాట్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందబోయే సర్కారు వారి పాట ఎప్పుడెప్పుడు మొదలవుతుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో కరోనా ఇంకా పూర్తిగా కట్టడి కాకపోవడంతో స్టార్లు సెట్ లో అడుగు పెట్టేందుకు ఇష్టపడటం లేదు. మరోవైపు టీవీ షూటింగ్స్ లో నటులకు వైరస్ సోకుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. దీని సంగతి ఎలా ఉన్నా తమన్ మాత్రం ట్యూన్స్ ని ఇంటి నుంచే కంపోజ్ చేయడం మొదలుపెట్టినట్టుగా తెలిసింది. నిన్నే […]
అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్స్ తో యూత్ హాట్ ఫేవరెట్ గా మారిన విజయ్ దేవరకొండకు ఆ స్థాయి బ్లాక్ బస్టర్ వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణమైన ఫలితాలు అందుకోవడంతో అభిమానులు కూడా సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే వాళ్ళ కళ్లన్నీ పూరి జగన్నాధ్ రూపొందిస్తున్న భారీ సినిమా మీదే ఉన్నాయి. ఇప్పటికే అరవై […]
హైదరాబాద్ లో అంతకంతా పెరుగుతూపోతున్న కరోనా కేసులతో పాటు టీవీ సీరియల్స్ షూటింగ్ లో యాక్టర్స్ దాని బారిన పడుతుండటంతో సినిమా తారలు హై అలెర్ట్ అయిపోయారు. వచ్చే నెల మొదటి వారం నుంచి సెట్ లో అడుగుపెడదాం అనుకున్న వాళ్లంతా దాదాపు డ్రాప్ అయ్యారని ఫిలిం నగర్ న్యూస్. ముఖ్యంగా స్టార్లు ససేమిరా అని చెబుతున్నట్టు టాక్. ఈ పరిస్థితి ఇంకో రెండు నెలలు కొనసాగేలా ఉంది కాబట్టి అప్పటిదాకా ఆశలు పెట్టుకున్నా లాభం లేదు. […]
కరోనా సంఘానికే కాదు సినిమా పరిశ్రమకూ బోలెడు పాఠాలు నేర్పించేసింది. ఇకపై ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టించే బడ్జెట్లు ఉండకపోవచ్చు. స్టార్ల రెమ్యునరేషన్లకు కోతలు పడవచ్చు. విదేశాల్లో నడిచే కథలకు గుడ్ బై చెప్పొచ్చు. ఔట్ డోర్ షూటింగులు వద్దనే డిమాండ్లు పెరగొచ్చు. ఇంకా చాలా చాలానే మార్పులు చూడబోతోంది పరిశ్రమ. ముఖ్యంగా కొత్త టాలెంట్ కు దారులు తెరవబోతున్నారు. నిర్మాతల ఇళ్ళు, ప్రొడక్షన్ హౌసుల ఆఫీసుల చుట్టూ తిరిగే యాతన న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ […]
లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన క్రాక్ బాలన్స్ వర్క్ కోసం వెయిట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ త్వరలో కొత్త బిజినెస్ ప్లాన్ తో రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. అయితే అది కూడా సినిమాకు సంబంధించినదే లెండి. త్వరలో రవితేజ స్వంతంగా ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ చేయబోతున్నట్టుగా తెలిసింది. తనది ప్లస్ పిల్లల పేర్లు కలిసి వచ్చేలా రెండు మూడు ఆప్షన్స్ తో ఆల్రెడీ ప్లానింగ్ కూడా మొదలైపోయిందట. కాకపోతే దీని ద్వారా కొత్త టాలెంట్ […]
జిఎంబి ఎంటర్ టైన్మెంట్ పేరుతో స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ కలిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు తాను మాత్రమే నటించేవి కాకుండా ఇతర హీరోలతో కూడా సినిమాలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అడవి శేష్ హీరోగా రూపొందుతున్న మేజర్ షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే ఆగస్ట్ లో రిలీజయ్యేది. ప్రస్తుతానికి పెద్ద బ్రేకే పడింది. సోనీ సంస్థతో కలిసి దీన్ని నిర్మిస్తున్న మహేష్ బడ్జెట్ విషయంలో రాజీ పడటం […]
ఓటిటి ట్రెండ్ కొనసాగుతున్న వేళ చిన్న సినిమాలు వరసగా డిజిటల్ దారి పట్టడం మొదలయ్యింది. పేరున్న హీరోలవి కాకపోయినా నిర్మాణ సంస్థల బ్రాండ్ ఇమేజ్ ని బట్టి వీటి మీద ఆసక్తి బాగానే కలుగుతోంది. మొన్న కీర్తి సురేష్ పెంగ్విన్ ని టాక్ తో సంబంధం లేకుండా జనం బాగానే చూశారని లీకవుతున్న స్టాట్స్ ని బట్టి అర్థమవుతోంది. ఈ కోవలోకే వచ్చిన మరో చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీల. సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 […]