iDreamPost
android-app
ios-app

మన స్టార్లు రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు

  • Published Aug 21, 2025 | 12:18 PM Updated Updated Aug 21, 2025 | 12:18 PM

ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలంటే ఎలా అయినా సరే హిట్ అయిపోయేవి అనే నమ్మకం ఉండేది. టాక్ బావుండే ఒకే ఆటోమాటిక్ గా కలెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ ఒకవేళ టాక్ అంతతమాత్రంగా ఉన్న సరే పెద్ద హీరోల సినిమాలు కాబట్టి ఫ్యాన్స్ వాటిని సేఫ్ జోన్ లోకి తీసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే.. మహా అయితే సినిమా లైఫ్ స్పాన్ ఒక వీకెండ్ మాత్రమే ఉంటుంది

  • Published Aug 21, 2025 | 12:18 PMUpdated Aug 21, 2025 | 12:18 PM
మన స్టార్లు రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు

ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలంటే ఎలా అయినా సరే హిట్ అయిపోయేవి అనే నమ్మకం ఉండేది. టాక్ బావుండే ఒకే ఆటోమాటిక్ గా కలెక్షన్స్ వచ్చేస్తాయి. కానీ ఒకవేళ టాక్ అంతతమాత్రంగా ఉన్న సరే పెద్ద హీరోల సినిమాలు కాబట్టి ఫ్యాన్స్ వాటిని సేఫ్ జోన్ లోకి తీసుకుని వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే.. మహా అయితే సినిమా లైఫ్ స్పాన్ ఒక వీకెండ్ మాత్రమే ఉంటుంది. దీనితో ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాతలకు భారీ నష్టాలు తప్పడం లేదు.

రీసెంట్ గా హరి హర వీరమల్లు విషయంలో నిర్మాత ఎం ఎం రత్నంకు ఎలాంటి అనుభవం ఎదురైందో తెలియనిది కాదు. ఆల్రెడీ సినిమా చాలా లేట్ గా రిలీజ్ అయింది. పైగా సినిమా విషయంలో ఏకంగా మొదటిసారి పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ చేశారు. దీనితో సినిమా మీద అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు . తీరా సినిమా రిలీజ్ తర్వాత అంచనాలు తారుమారు అయ్యాయి. రిలీజ్ కు ముందే పవన్ కళ్యాణ్ సినిమాకు పారితోషకం తీసుకోలేదు. ఇక రిలీజ్ తర్వాత మాట అడిగే పరిస్థితే రాలేదు. అలా పవన్ కళ్యాణ్ కష్ట సమయంలో నిర్మాతకు తోడుగా ఉన్నారు. ఇక ఇప్పుడు తారక్ వంతు

జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వార్ 2 తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో తారక్ ఉండడంతో.. తారక్ మీద అభిమానంతో , నమ్మకంతో ఏకంగా రూ.80 కోట్లు పెట్టి తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు నాగవంశీ. కానీ ఇప్పుడు వార్ 2 గురించి ఎలాంటి టాక్ వస్తుందో తెలియనిది కాదు. పెట్టిన అమౌంట్ లో సగం కూడా వెనక్కు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీనితో ఇప్పడూ నాగవంశీని ఆదుకోడానికి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా కష్టకాలంలో నిర్మాతలు అండగా ఉండడం ద్వారా మన స్టార్లు నిజంగానే రియల్ హీరోలని అనిపించుకుంటున్నారు.