iDreamPost
android-app
ios-app

టెలివిజన్ లో టాప్.. కానీ సిల్వర్ స్క్రీన్ పై !

  • Published Jul 15, 2025 | 4:29 PM Updated Updated Jul 15, 2025 | 4:29 PM

సినిమాలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువైన విషయం కానే కాదు. ఇక్కడ కష్టపడడం ఎంత ముఖ్యమో అదృష్టం కలిసి రావడం కూడా అంతే ముఖ్యం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలలోకి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి.. దాని నుంచి వెండితెర మీదకు వస్తున్న హీరోలను ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తూనే ఉన్నాము.

సినిమాలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువైన విషయం కానే కాదు. ఇక్కడ కష్టపడడం ఎంత ముఖ్యమో అదృష్టం కలిసి రావడం కూడా అంతే ముఖ్యం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలలోకి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి.. దాని నుంచి వెండితెర మీదకు వస్తున్న హీరోలను ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తూనే ఉన్నాము.

  • Published Jul 15, 2025 | 4:29 PMUpdated Jul 15, 2025 | 4:29 PM
టెలివిజన్ లో టాప్.. కానీ సిల్వర్ స్క్రీన్ పై !

సినిమాలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులువైన విషయం కానే కాదు. ఇక్కడ కష్టపడడం ఎంత ముఖ్యమో అదృష్టం కలిసి రావడం కూడా అంతే ముఖ్యం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలలోకి వచ్చి సక్సెస్ అయినా వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించి.. దాని నుంచి వెండితెర మీదకు వస్తున్న హీరోలను ఈ మధ్య కాలంలో చాలా మందిని చూస్తూనే ఉన్నాము. అలా అని ప్రతి ఒక్కరికి వెంటనే సక్సెస్ వస్తుందా అంటే ఇది ఎప్పటికి ప్రస్నార్ధకమే. మొగలి రేకులు సీరియల్ తెలుగు వారందరికీ ఎంత సుపరిచితమో తెలియనిది కాదు. ప్రత్యేకించి అందులో ఆర్కే నాయుడు క్యారెక్టర్ కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అలా ఆ సీరియల్ హీరో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద హీరోగా నిలదొక్కుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

కానీ ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది. రీసెంట్ గా ‘ది 100’ సినిమాకు తగిన ఆదరణ లభించలేదు. ప్రమోషన్స్ బాగానే చేసారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. కేవలం సాగర్ మాత్రమే కాదు బుల్లి తెర మీద నుంచి వెండితెర మీదకు వచ్చిన చాలా మంది నటి నటులు ఇలాంటి ఫెయిల్యూర్స్ నే చవి చూసారు. అలా అని వాళ్ళు అంత పాపులర్ కాదా అంటే … వీళ్ళు లేకపోతే ఆ షోస్ టిఆర్పి లే పడిపోతాయి. కానీ వెండితెరమీదకు వచ్చేసరికి సీన్ వేరే..సినిమాలో ఎంత వాళ్లకు నచ్చిన హీరో ఉన్నా సరే కథ కథనం దర్శకత్వం బాలేకపోతే మాత్రం సినిమా నిలబడడం కష్టం. ప్రేక్షకుల ప్రయారిటీ ఎప్పుడు వాళ్ళ టికెట్ కు న్యాయం జరిగిందా లేదా అనే దాని మీదే ఉంటుంది. కానీ తెర వెనుక వారు ఎంత కష్టపడి వచ్చారన్నది అనవసరం. ఇది తప్పేం కాదు. ఎందుకంటే రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసినప్పుడు రేట్ కు తగ్గ టేస్ట్ ముఖ్యం కానీ హోటల్ ఓనర్ ఆర్ధిక పరిస్థితి, లాభ నష్టాలు మనం పట్టించుకోము కదా.

సో ఈ బుల్లి తెర నటి నటులంతా సిల్వర్ స్క్రీన్ హీరోలుగా నిలదొక్కుకోవాలంటే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రొటీన్ కథలు కాకుండా కంటెంట్ బేస్డ్ కథలు ఎంచుకోవాలీ. టెలివిజన్ ఇమేజ్ ను బ్రేక్ చేసేలా ఆ క్యారెక్టర్స్ ఉంటె కనుక అప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం థియేటర్స్ కు ప్రేక్షకులు రప్పించడం మెయిన్ స్ట్రీమ్ హీరోస్ వలన కూడా కష్టతరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో టెలివిజన్ స్టార్స్ సిల్వర్ స్క్రీన్ స్టార్స్ గా మారడం అంటే అది వారికి చాలా పెద్ద టాస్క్ అని చెప్పి తీరాల్సిందే. టీవీ స్టార్ నుంచి సినిమా స్టార్ గా మారడం అంత తేలికైనా విషయం కాదు. అలా అని అసాధ్యము కాదు. ఎదో ఓ రోజు ఓ మంచి కథ పడిందంటే వారికి కూడా బ్రేక్ దొరికినట్టే. ఇక ముందు ముందు ఈ నటులు ఎలాంటి కథలను ఎంచుకుంటారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.