iDreamPost
android-app
ios-app

ఫౌజీ , స్పిరిట్ డార్లింగ్ నుంచి నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుంది !

  • Published Jan 27, 2026 | 3:27 PM Updated Updated Jan 27, 2026 | 3:27 PM

ఎప్పుడెప్పుడా వేయికళ్లతో ఎదురుచూసిన రాజాసాబ్ వచ్చేసింది. సినిమా మీద చాలా మంది చాలానే ఆశలు పెట్టుకున్నారు కానీ ఎందుకో ఊహించినంత రేంజ్ లో మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. సినిమాను మెచ్చుకున్నవారు ఉన్నారు .. సినిమా చూసి నొచ్చుకున్నవారు కూడా ఉన్నారు.

ఎప్పుడెప్పుడా వేయికళ్లతో ఎదురుచూసిన రాజాసాబ్ వచ్చేసింది. సినిమా మీద చాలా మంది చాలానే ఆశలు పెట్టుకున్నారు కానీ ఎందుకో ఊహించినంత రేంజ్ లో మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. సినిమాను మెచ్చుకున్నవారు ఉన్నారు .. సినిమా చూసి నొచ్చుకున్నవారు కూడా ఉన్నారు.

  • Published Jan 27, 2026 | 3:27 PMUpdated Jan 27, 2026 | 3:27 PM
ఫౌజీ , స్పిరిట్ డార్లింగ్ నుంచి నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుంది !

ఎప్పుడెప్పుడా వేయికళ్లతో ఎదురుచూసిన రాజాసాబ్ వచ్చేసింది. సినిమా మీద చాలా మంది చాలానే ఆశలు పెట్టుకున్నారు కానీ ఎందుకో ఊహించినంత రేంజ్ లో మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. సినిమాను మెచ్చుకున్నవారు ఉన్నారు .. సినిమా చూసి నొచ్చుకున్నవారు కూడా ఉన్నారు. కానీ చాలా కాలం తర్వాత అందరూ డార్లింగ్ వింటేజ్ వైబ్ ను ఎంజాయ్ చేసిన మాట వాస్తవం. సరే ఇదంతా అయిపోయిన కథ.. ఎదో ఈ సినిమాకు ఇలా అయింది కదా అని డార్లింగ్ అభిమానులు నిరాశలో ఉండిపోరు. ఎందుకంటే దానికి మించిన సినిమాలు ప్రభాస్ అప్ కమింగ్ లిస్ట్ లో చాలానే ఉన్నాయి.

వాటిలో ప్రస్తుతం బజ్ అంతా ఫౌజీ , స్పిరిట్ సినిమాల మీదే నడుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు కంప్లీట్ అయితే కల్కి 2 సెట్స్ మీదకు వెళ్తుంది. వీటిలో ఫౌజీ షూటింగ్ దాదాపు సగానికి పైగానే కంప్లీట్ అయినట్టు చెప్తున్నారు. స్పిరిట్ కూడా మొన్నీమధ్యనే సెట్స్ మీదకు వెళ్లినట్టు సమాచారం. ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. అసలు లెక్క ప్రకారం ఫౌజీ ముందు విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత స్పిరిట్ రావాలి. కానీ ఇప్పుడు లెక్కలు తారుమారు అయ్యాయట.

అన్నిటికంటే ముందు స్పిరిట్ రిలీజ్ అవుతుందట. 2027 మార్చి 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామంటూ నిర్మాత‌లు ప్ర‌క‌టించేశారు. కానీ ఫౌజీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది . ఆగస్టు లేదా సెప్టెంబర్ కు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుందట . స్పిరిట్ రిలీజ్ అయినా నాలుగు నెలల గ్యాప్ లో ఫౌజీ రానుందట. అంటే వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రానున్నాయట. మార్కెట్ లెక్కల ప్రకారం కూడా ఇదే ముందు రావడం బెటర్ అని అంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.