iDreamPost
android-app
ios-app

జూలై నెల బాక్స్ ఆఫీస్ కు పెద్ద షాక్ ఏ ఇచ్చిందిగా !

  • Published Aug 01, 2025 | 10:42 AM Updated Updated Aug 01, 2025 | 10:42 AM

అనుకున్నట్లుగానే జూన్ నెలలో కుభేరతో మంచి స్టార్ట్ అప్ అయితే దొరికింది కానీ.. బాక్స్ ఆఫీస్ రేంజ్ మూవీ కాదది. సో బాక్స్ ఆఫీస్ ను రఫ్ ఆడించే సినిమాలన్నీ జూలై నెలలో రాబోతున్నాయని సంతోషపడ్డారు. తీరా చూస్తే నెల ప్రారంభంలో ఓ షాక్.. ఆఖర్లో మరో షాక్ తో జూలై నెలలో కూడా బాక్స్ ఆఫీస్ కల కలలానే మిగిలిపోయింది.

అనుకున్నట్లుగానే జూన్ నెలలో కుభేరతో మంచి స్టార్ట్ అప్ అయితే దొరికింది కానీ.. బాక్స్ ఆఫీస్ రేంజ్ మూవీ కాదది. సో బాక్స్ ఆఫీస్ ను రఫ్ ఆడించే సినిమాలన్నీ జూలై నెలలో రాబోతున్నాయని సంతోషపడ్డారు. తీరా చూస్తే నెల ప్రారంభంలో ఓ షాక్.. ఆఖర్లో మరో షాక్ తో జూలై నెలలో కూడా బాక్స్ ఆఫీస్ కల కలలానే మిగిలిపోయింది.

  • Published Aug 01, 2025 | 10:42 AMUpdated Aug 01, 2025 | 10:42 AM
జూలై నెల బాక్స్ ఆఫీస్ కు పెద్ద షాక్ ఏ ఇచ్చిందిగా !

అసలే పీక్ సమ్మర్ సీజన్ లో సినిమాలు లేవని.. థియేటర్ ఓనర్స్ లబోదిబోమన్నారు. అయినా సరే మరేం పర్లేదు సమ్మర్ తర్వాతే అసలైన బాక్స్ ఆఫీస్ వేట మొదలవుతుంది అనుకుని సర్దుకుపోయారు. అనుకున్నట్లుగానే జూన్ నెలలో కుభేరతో మంచి స్టార్ట్ అప్ అయితే దొరికింది కానీ.. బాక్స్ ఆఫీస్ రేంజ్ మూవీ కాదది. సో బాక్స్ ఆఫీస్ ను రఫ్ ఆడించే సినిమాలన్నీ జూలై నెలలో రాబోతున్నాయని సంతోషపడ్డారు. తీరా చూస్తే నెల ప్రారంభంలో ఓ షాక్.. ఆఖర్లో మరో షాక్ తో జూలై నెలలో కూడా బాక్స్ ఆఫీస్ కల కలలానే మిగిలిపోయింది.

జూన్ ఆఖరిలో కన్నప్ప ఇచ్చిన షాక్ నుంచి కోలుకోక ముందే.. జూలై మొదటి వారంలో నితిన్ తమ్ముడు డిజాస్టర్ టాక్ తో థియేటర్ ఓనర్స్ ను డీలా పడేలా చేసింది. అప్పటికే నితిన్ ప్లాపులతో ఉన్న కారణమో ఏమో తెలియదు కానీ.. ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు. ఇక అదే వారంలో సిద్దార్ధ్ 3BHK తో పాటు మరో రెండు సినిమాలు వచ్చాయి. అవి కూడా ఓ మోస్తరు టాక్ సంపాదించుకుని థియేటర్ నుంచి బయటకు వచ్చేశాయి. సరే రెండో వారంలో ఏమైనా సినిమాలు బాక్స్ ఆఫీస్ కు బూస్టప్ ఇస్తాయా అనుకుంటే.. ఓ భామ అయ్యో రామా, దీర్ఘాయుష్మాన్ భవ, విర్జిన్ బాయ్స్ లాంటి సినిమాలు రిలీజ్ అయ్యి.. అసలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్లిపోయాయి కూడా తెలియనంతలా మాయమైపోయాయి.

ఇక మూడోవారంలో పోలీసువారి హెచ్చరిక, మై బేబీ, కొత్తపల్లిలో ఒకప్పుడు, జూనియర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొంతమేరకు జూనియర్ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించగలిగింది. సరే ఇవన్నీ కాదు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టడానికి టయర్ 1 హీరో మూవీ బరిలోకి దిగుతుందని అంతా ఆశగా ఎదురుచూసారు. పవన్ కళ్యాణ్ సినిమా అందులోను చాలా సంవత్సరాల తర్వాత రావడంతో ఓపెనింగ్స్ గ్రాండ్ గానే దక్కాయి. అయితే VFX దెబ్బకొట్టడంతో ఆ ఎఫెక్ట్ వసూళ్ళమీద పడింది. దీనితో భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గానే నిలిచిపోయింది.

ఆ సినిమాతో పాటు తెలుగు స్ట్రెయిట్ రిలీజ్ కాకపోయినా.. హోంబలే బ్యానర్స్ నుంచి మహావతార్ నరసింహ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాకు మాత్రం సూపర్ హిట్ టాక్ లభిస్తుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేలా.. తాజాగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయింది. ప్రస్తుతానికైతే సినిమాకు మిక్సెడ్ టాక్ వస్తుంది. అయితే ఇది కూడా బాక్స్ ఆఫీస్ లెక్కలను సరిచేసేలా మాత్రం అనిపించడం లేదు. మొత్తానికి జూలై నెల బాక్స్ ఆఫీస్ కు పెద్ద షాక్ ఏ తగిలిందని చెప్పొచ్చు. ఇక ముందు ముందు రాబోయే సినిమాలైనా గట్టెక్కిస్తాయో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.