Swetha
బాహుబలితో రాజమౌళి స్టార్ట్ చేసిన సిక్వెల్ కాన్సెప్ట్ దాదాపు అన్ని పాన్ ఇండియా సినిమాలకు వాడేసుకున్నారు. కొన్నైతే ఒక స్టెప్ ముందుకు వేసి పార్ట్ 3 లు కూడా అనౌన్స్ చేసేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ కు కూడా మూడో భాగం జై అఖండ అనే పేరుతో ఉంటుందని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాహుబలితో రాజమౌళి స్టార్ట్ చేసిన సిక్వెల్ కాన్సెప్ట్ దాదాపు అన్ని పాన్ ఇండియా సినిమాలకు వాడేసుకున్నారు. కొన్నైతే ఒక స్టెప్ ముందుకు వేసి పార్ట్ 3 లు కూడా అనౌన్స్ చేసేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ కు కూడా మూడో భాగం జై అఖండ అనే పేరుతో ఉంటుందని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి.
Swetha
బాహుబలితో రాజమౌళి స్టార్ట్ చేసిన సిక్వెల్ కాన్సెప్ట్ దాదాపు అన్ని పాన్ ఇండియా సినిమాలకు వాడేసుకున్నారు. కొన్నైతే ఒక స్టెప్ ముందుకు వేసి పార్ట్ 3 లు కూడా అనౌన్స్ చేసేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ కు కూడా మూడో భాగం జై అఖండ అనే పేరుతో ఉంటుందని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెట్టేస్తే ఆల్రెడీ అనౌన్స్ చేసిన సిక్వెల్స్ చాలానే ఉన్నాయి. వీటి అన్నిటిలో అంతా ఈగర్ గా వెయిట్ చేసే సిక్వెల్ ఏదైనా ఉందా అంటే అది సలార్ 2 అనే చెప్పాలి. కానీ అది అసలు ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
కల్కి 2 పరిస్థితి కూడా ఇంతే ఉంది.. కానీ అది కచ్చితంగా రావాల్సిన సినిమా. అలాగే అల్లు అర్జున్ పుష్ప 3 కూడా ఉంది. కానీ అది ఇప్పటిలో వచ్చే ప్రసక్తి లేదు. ఇవి కాకుండా విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాకు కూడా పెదకాపు పేరుతో సిక్వెల్ ఉందని తెలిపారు.. కానీ అది దాదాపు రాకపోవచ్చు. అలాగే కళ్యాణ్ రామ్ బిమ్బిసార అనౌన్స్ చేసి చాలా కాలం అయింది.. దాని గురించి అసలు ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఎన్టీఆర్ దేవర 2 విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. దీనితో అసలు కొన్ని సిక్వెల్స్ ఉంటాయో ఉండవో కూడా ఎవరికీ అర్థంకావడం లేదు.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమాకు కూడా సిక్వెల్ ఉందని అన్నారు . ఈ విషయంలో ప్రశాంత్ నీల్ ముందే ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటాడేమో చూడాలి. ఈ సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే.. కథను మధ్యలో ఆపేసిన సలార్ 2 , కల్కి , పుష్ప 3 , కింగ్డమ్ సినిమాలలైతే కచ్చితంగా రావాలి. ఇక ఇవన్నీ ఎప్పటికి అవుతాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.