iDreamPost
android-app
ios-app

తెలుగు రిలీజ్ కు రెడీ అయిన ‘పా.. పా’

  • Published Jun 11, 2025 | 5:05 PM Updated Updated Jun 11, 2025 | 5:05 PM

ప్రేక్షకులు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో పాటు... కంటెంట్ ఉన్న ప్రతి సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల విషయంలో ఇది చాలా సార్లు ప్రూవ్ అవుతూనే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చాలా సినిమాలు.. బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లతో మంచి పేరు సంపాదించుకున్నాయి.

ప్రేక్షకులు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో పాటు... కంటెంట్ ఉన్న ప్రతి సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల విషయంలో ఇది చాలా సార్లు ప్రూవ్ అవుతూనే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చాలా సినిమాలు.. బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లతో మంచి పేరు సంపాదించుకున్నాయి.

  • Published Jun 11, 2025 | 5:05 PMUpdated Jun 11, 2025 | 5:05 PM
తెలుగు రిలీజ్ కు రెడీ అయిన ‘పా.. పా’

తెలుగులో ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ రాబోతుంది. ప్రేక్షకులు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో పాటు… కంటెంట్ ఉన్న ప్రతి సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాల విషయంలో ఇది చాలా సార్లు ప్రూవ్ అవుతూనే ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చాలా సినిమాలు.. బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లతో మంచి పేరు సంపాదించుకున్నాయి. సో ఆడియన్స్ మూవీస్ ను చూసే తీరు పూర్తిగా మారిపోయింది.

ఈ క్రమంలో దర్శక నిర్మాతలు కూడా ఈ ట్రెండ్ కు తగినట్లుగానే కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. వాటిలో సొంత కథలను తెరపై చూపించేవి కొన్నైతే.. రీమేక్ కథలను కొత్తగా చూపించేవి మరికొన్ని. ఇక వాటిలో డబ్బింగ్ సినిమాలు ఇంకొన్ని. ఈ క్రమంలో జూన్ 13న థియేట‌ర్‌ల‌లో ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతుంది. ఆ సినిమా మరేదో కాదు.. కవిన్, అపర్ణ దాస్, ఐశ్వర్య, భాగ్యరాజ్ ,వీటీవి గణేష్ లాంటి నటీ నటులు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ.. ‘డా..డా’. ఇప్పుడు తెలుగులో ‘పా..పా’ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.

తమిళంలో ఈ సినిమాను అంబేత్ కుమార్ సమర్పించగా గణేష్ కె బాబు దర్శకత్వం వహించారు. తెలుగులో రవివర్మ ఆకుల ఈ సినిమాకు సాహిత్యం అందించారు. రవివర్మ ఆకుల ఇప్పటికే రెండు సినిమాలకు సాహిత్యం అందించి.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. గతంలో రివైండ్ అనే సినిమాకు రెండు పాటలు అందించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు అన్ని సాంగ్స్ రవివర్మ సాహిత్యం అందించారు.    ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది.  ఇక గత ఏడాది రిలీజ్ అయిన ‘డా..డా మూవీ విషయానికొస్తే.. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. తక్కువ బడ్జెట్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ కలెక్షన్స్ తెచ్చింది. కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు తెలుగులో ‘పా..పా’ కూడా మంచి విజయాన్ని సాధిస్తుంది అని ఆశిస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో జెకె ఎంటర్టైన్మెంట్స్ పై నీరజ్ కోట నిర్మిస్తున్నారు. ఇక ‘పా..పా’ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş