iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ సినిమాలతో చాలా టఫ్

  • Published Aug 21, 2025 | 3:00 PM Updated Updated Aug 21, 2025 | 3:00 PM

ఆగస్టు నెలలో వార్ 2, కూలీ లాంటి సినిమాలు ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయని అని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ రెండు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఆగస్టు ఎండింగ్ మాస్ మహారాజ్ మాస్ జాతరతో ముగుస్తుందని అనుకున్నారు అంతా. కానీ అది కూడా వాయిదా పడింది.

ఆగస్టు నెలలో వార్ 2, కూలీ లాంటి సినిమాలు ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయని అని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ రెండు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఆగస్టు ఎండింగ్ మాస్ మహారాజ్ మాస్ జాతరతో ముగుస్తుందని అనుకున్నారు అంతా. కానీ అది కూడా వాయిదా పడింది.

  • Published Aug 21, 2025 | 3:00 PMUpdated Aug 21, 2025 | 3:00 PM
సెప్టెంబర్ సినిమాలతో చాలా టఫ్

ఆగస్టు నెలలో వార్ 2, కూలీ లాంటి సినిమాలు ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయని అని అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ రెండు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఆగస్టు ఎండింగ్ మాస్ మహారాజ్ మాస్ జాతరతో ముగుస్తుందని అనుకున్నారు అంతా. కానీ అది కూడా వాయిదా పడింది. సో ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ మీద పడింది. పైగా సెప్టెంబర్ లో అన్ని చెప్పుకోదగిన సినిమాలే ఉండడంతో అభిమానుల ఆనందానికి అంతే లేదు.

అన్నిటికంటే ముందైతే సెప్టెంబర్ 4 న అనుష్క ఘాటీ సినిమా వచ్చేస్తుంది. ఇప్పటికే మూవీ చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఈసారి పక్కా వచ్చి తీరుతుంది ఈ సినిమా. ఆ తర్వాత రోజే మాస్ జాతర వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ కుదరని పక్షంలో ఇది సెప్టెంబర్ 12కి వెళ్తుంది. అదే రోజున తేజ సజ్జ మిరాయ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనిపించుకుంటుందో చూడాలి. వీరందరికంటే ముందే అదే డేట్ ను లాక్ చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్. లేటెస్ట్ గా ఈ హీరో నటించిన కిష్కిందపూరి మూవీ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. సో ఈ మూడు సినిమాలు ఒకే డేట్ దగ్గర ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

ఈ మూడు సినిమాల గురించి ఏ సమయంలో ఎలాంటి న్యూస్ వస్తుందో చూడాలి. ఇక ఇది దాటితే టాలీవుడ్ దగ్గర అతి పెద్ద క్లాష్ సెప్టెంబర్ 25 న జరగబోతుంది. పవన్ కళ్యాణ్ ఓజి , బాలకృష్ణ అఖండ 2 రెండు సినిమాలు అదే రోజు రానున్నట్లు ఎవరికీ వారు పక్కా అనౌన్సుమెంట్స్ ఇచ్చేసారు. అయితే అఖండ 2 విషయంలో మాత్రం వచ్చేవరకు కాస్త సందేహ పడాల్సిందే. ఇవన్నీ స్ట్రెయిట్ సినిమాలు.. ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాలు ఉండనే ఉన్నాయి .శివ కార్తికేయన్ మదరాసి సెప్టెంబర్ 5న , విజయ్ ఆంటోని భద్రకాళి సెప్టెంబర్ 12న.. రానున్నాయి. సో మొత్తం మీద సెప్టెంబర్ లో సినిమాల సందడి బాగానే ఉంది. కానీ కొంతమంది అభిమానులు మాత్రం మరీ అంత హైప్ పెంచుకోకుండా వెళ్లడం బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. దానికి కారణాలు ఏంటో తెలియనివి కాదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.