iDreamPost
android-app
ios-app

బాక్స్ ఆఫీస్ భారమంతా కుభేరుడి మీదే

  • Published Jun 07, 2025 | 12:27 PM Updated Updated Jun 07, 2025 | 12:27 PM

Kubhera Movie : జూన్ నెలలో వారానికో పాన్ ఇండియా మూవీతో థియేటర్స్ కళకళలాడుతాయి అనుకుంటే.. మొదటికే మోసం వచ్చింది. కమల్ థగ్ లైఫ్ కు సరైన రెస్పాన్స్ రాకపోవడం, హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవ్వడం ఇలా బాక్స్ ఆఫీస్ మీద దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది

Kubhera Movie : జూన్ నెలలో వారానికో పాన్ ఇండియా మూవీతో థియేటర్స్ కళకళలాడుతాయి అనుకుంటే.. మొదటికే మోసం వచ్చింది. కమల్ థగ్ లైఫ్ కు సరైన రెస్పాన్స్ రాకపోవడం, హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవ్వడం ఇలా బాక్స్ ఆఫీస్ మీద దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది

  • Published Jun 07, 2025 | 12:27 PMUpdated Jun 07, 2025 | 12:27 PM
బాక్స్ ఆఫీస్ భారమంతా కుభేరుడి మీదే

జూన్ నెలలో వారానికో పాన్ ఇండియా మూవీతో థియేటర్స్ కళకళలాడుతాయి అనుకుంటే.. మొదటికే మోసం వచ్చింది. కమల్ థగ్ లైఫ్ కు సరైన రెస్పాన్స్ రాకపోవడం, హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అవ్వడం ఇలా బాక్స్ ఆఫీస్ మీద దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇంకో రెండు వారాలు థియేటర్స్ మూసేస్తే బెటర్ అనే ఫీలింగ్ కు వచ్చేస్తున్నారు ఎగ్జిబిటర్లు . ఇదే కనుక కొనసాగితే చాలా మంది ఈ వ్యాపారం నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈ గండాన్ని గట్టెక్కించాలి అంటే అది కుభేరుడికే సాధ్యం. జూన్ 20న కుభేర మూవీ థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది.

ఈ సినిమా మీద ప్రస్తుతానికి భారీ అంచనాలే నెలకొన్నాయి. ఏడాదిన్నర తర్వాత నాగార్జున తెరమీద కనిపించడం , ధనుష్ క్యారక్టర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడం.. పైగా మొన్న వచ్చిన టీజర్ కట్ , సాంగ్స్ ఇంకాస్త హైప్ పెంచడం. అలా అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఇక శేఖర్ కమ్ముల సినిమా అంటే నిజాయితీని తెరపై చూడడం లాంటిదే. చాలా ప్రమోసింగ్ గా కథను చెప్పేవారిలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రేక్షకులు యిట్టె కన్విన్స్ అయిపోతూ ఉంటారు. సో సినిమా మీద అంతా చాలా నమ్మకం పెట్టుకున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ కు ప్రాణం పోయాల్సిన బాధ్యత కుబేర మీద ఉంది. ఒక బిచ్చగాడు కోటీశ్వరుడు అయ్యే క్రమంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా శేఖర్ కమ్ముల దీన్ని తెరకెక్కించారు. పాటలు వేటికవే కథను కొత్తగా చెప్తున్నట్టు అనిపిస్తున్నాయి. కథ కనక క్లిక్ అయితే కుబేరకు వసూళ్ల వర్షం ఖాయం. క్లాస్ మూవీస్ ను తీసే శేఖర్ కమ్ముల ఈసారి కమర్షియల్, యాక్షన్ అంశాలను కూడా జోడించాడు. ఇక ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin