iDreamPost
android-app
ios-app

పూరి స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం పెద్ద స్కెచ్

  • Published Jun 17, 2025 | 11:49 AM Updated Updated Jun 17, 2025 | 11:49 AM

అప్పట్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. కానీ ఈ మధ్య కాలంలో పూరి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. లైగర్ , డబుల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్స్ ఈ దర్శకుడిని నిరాశ పరిచాయి. దీనితో పూరి జగన్నాథ్ ఈసారి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దానికోసం క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

  • Published Jun 17, 2025 | 11:49 AMUpdated Jun 17, 2025 | 11:49 AM
పూరి స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం పెద్ద స్కెచ్

అప్పట్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. కానీ ఈ మధ్య కాలంలో పూరి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. లైగర్ , డబుల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్స్ ఈ దర్శకుడిని నిరాశ పరిచాయి. దీనితో పూరి జగన్నాథ్ ఈసారి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దానికోసం క్యాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా కొన్ని ప్లాపులు వచ్చినప్పుడు ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ కైనా కాంబోలు సెట్ చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. దీనితో ఈ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఇప్పుడు పూరి చేస్తున్న పని కూడా అంతే.

ఈ క్రమంలో పూరి జగన్నాథ్ సీనియర్ నటి టబుని సెలెక్ట్ చేశాడు, వీరసింహారెడ్డి విలన్ దునియా విజయ్ ని సెలెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు రీసెంట్ గా సంయుక్త మీనన్ ని కూడా కన్ఫర్మ్ చేశాడు పూరి. సో ఈసారి పూరి సినిమాలో మంచి గ్లామర్ టచ్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. పూర్తి జగన్నాథ్ ప్రస్తుతం సూపర్ డూపర్ ఫార్మ్ లో లేకపోయినా.. తన కెరీర్ లో మాత్రం మంచి డీసెంట్ హిట్స్ ఏ ఉన్నాయి. సో ఈసారి పూరి పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగబోతున్నాడని తెలుస్తుంది

ఇక ఈ సినిమా టైటిల్ విషయానికొస్తే.. ముందు బెగ్గర్ అనే టైటిల్ వినిపించింది. కానీ ఫైనల్ గా భిక్షామ్ దేహి అనే టైటిల్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ఏమి రాలేదు. కానీ దాదాపు ఈ టైటిల్ ను ఫిక్స్ చేస్తారట మేకర్స్. సో పూరి నటీనటులు , సాంకేతిక వర్గం , ఇలా ఏ విషయంలోనూ రాజి పడడం లేదట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.