iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో యాక్టింగ్ వర్క్‌షాప్

  • Published Oct 19, 2025 | 3:41 PM Updated Updated Oct 19, 2025 | 3:41 PM

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో 2025 అక్టోబరు 16న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఔత్సాహిక నటీనటుల కోసం ఒక రోజు యాక్టింగ్ వర్క్‌షాప్ విజయవంతంగా జరిగింది.

  • Published Oct 19, 2025 | 3:41 PMUpdated Oct 19, 2025 | 3:41 PM
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో యాక్టింగ్ వర్క్‌షాప్

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో 2025 అక్టోబరు 16న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో ఔత్సాహిక నటీనటుల కోసం ఒక రోజు యాక్టింగ్ వర్క్‌షాప్ విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు కిషోర్ దాస్, వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్, నటులు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ, సతీష్, ప్రణయ్ రాజ్ వంగరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 80 మంది ఔత్సాహిక నటీనటులు ఈ వర్క్‌షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రముఖ సినీ నటులు కిషోర్ దాస్ మాట్లాడుతూ… “నటన అనేది కేవలం కెమెరా ముందు నిలబడటం కాదు, అది ఒక సాధన. కొత్తగా సినిమా రంగంలోకి రావాలనుకునే వారు ముందుగా నటనలో మెళకువలు నేర్చుకోవాలి. ఏ పాత్రనైనా మన సొంతం చేసుకునే విధంగా ప్రదర్శించగలిగితేనే మీరు విజయం సాధిస్తారు. కష్టపడితే అవకాశాలు తప్పక వస్తాయి. సరైన వేదికను ఎంచుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలి” అన్నారు.

వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్, నటులు నువ్వుల వినోద్ కుమార్ మాట్లాడుతూ… “సినిమా రంగం అనేది అద్భుతమైన వేదిక. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే పట్టుదల చాలా ముఖ్యం. నటనలో మెళకువలు నేర్పించడంతో పాటు, పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలా ప్రయత్నించాలి అనే విషయాలపై మా అకాడమీ ఎప్పుడూ యువతకు మార్గదర్శనం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి” అన్నారు.

దర్శకులు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ… “దర్శకుడిగా మేము నటుల నుండి కోరుకునేది నైపుణ్యం, అంకితభావం. కొత్త నటీనటులు కేవలం గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా, నటనను ఒక వృత్తిగా గౌరవించాలి. ముఖ్యంగా, మంచి కథ, పాత్ర ఎంపికలో దర్శకులు ఎలాంటి అంశాలను పరిశీలిస్తారో తెలుసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది” అన్నారు.

దర్శకులు సతీష్ మాట్లాడుతూ… “నేటి సినిమా రంగం కొత్త ప్రతిభను ఆహ్వానిస్తోంది. అయితే, కేవలం నటన మాత్రమే కాకుండా, సమయపాలన, క్రమశిక్షణ వంటి అంశాలు కూడా ఇక్కడ విజయానికి కీలకం. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నిరంతర అభ్యాసం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం అవసరం” అన్నారు.

దర్శకులు ప్రణయ్ రాజ్ వంగరి మాట్లాడుతూ… “టెక్నాలజీ మారుతున్న ఈ తరుణంలో, నటీనటులు కూడా తమ నైపుణ్యాలను అప్‌డేట్ చేసుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ వంటి కొత్త ప్లాట్‌ఫామ్‌లలో తమ ప్రతిభను చాటుకోవాలి. మంచి పాత్రలు, మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకోవడంలో దృష్టి పెట్టండి. అదృష్టం, కృషి కలిస్తే విజయం మీదే” అన్నారు.

ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న అతిథులు, ఔత్సాహిక నటీనటులకు నటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాత్రలో లీనమవడం, వాయిస్ మాడ్యులేషన్, భావోద్వేగాలను పలికించడం వంటి అనేక అంశాలపై విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం, వర్క్‌షాప్‌లో పాల్గొన్న దాదాపు 80 మంది ఔత్సాహిక నటీనటులకు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. నిర్వాహకులు ఈ కార్యక్రమం విజయవంతం అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet