Swetha
నార్మల్ వీకెండ్ కాకుండా వారం మధ్యలో ఏదైనా ఫెస్టివల్ కానీ నేషనల్ హాలిడే కానీ వస్తే.. ఇక అది ఎక్స్టెండెడ్ వీకెండ్ తో కొత్త రిలీజ్లకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. చాలా వరకు దర్శక నిర్మాతలు ఈ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. గతవారం ఇదే తరహాలో కూలి , వార్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
నార్మల్ వీకెండ్ కాకుండా వారం మధ్యలో ఏదైనా ఫెస్టివల్ కానీ నేషనల్ హాలిడే కానీ వస్తే.. ఇక అది ఎక్స్టెండెడ్ వీకెండ్ తో కొత్త రిలీజ్లకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. చాలా వరకు దర్శక నిర్మాతలు ఈ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. గతవారం ఇదే తరహాలో కూలి , వార్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
Swetha
నార్మల్ వీకెండ్ కాకుండా వారం మధ్యలో ఏదైనా ఫెస్టివల్ కానీ నేషనల్ హాలిడే కానీ వస్తే.. ఇక అది ఎక్స్టెండెడ్ వీకెండ్ తో కొత్త రిలీజ్లకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. చాలా వరకు దర్శక నిర్మాతలు ఈ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. గతవారం ఇదే తరహాలో కూలి , వార్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. టాక్ అంతతమాత్రంగా ఉంది కాబట్టి కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. కానీ ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం సినిమాల కలెక్షన్స్ కు డోకా ఉండేది కాదు. అయినా సరే ఆ లాంగ్ వీకెండ్ ఆయా సినిమాలకు ఓ మాదిరిగా బాగానే కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చే వీకెండ్ విషయానికొస్తే. వినాయకచవితి వీకెండ్.
బుధవారం పండగ కనుక సినిమా రిలీజ్ చేస్తే.. ఏకంగా ఐదు రోజులపాటు సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ వీకెండ్ ఉపయోగించుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. ఆరోజున రావాల్సిన మాస్ మహారాజ్ రవితేజ ‘మాస్ జాతర’ కూడా వాయిదా పడింది. సెప్టెంబర్ 12 వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సరే ఇది కాకపోయినా సెప్టెంబర్ 5 టార్గెట్ పెట్టుకున్న ఘాటీ , మిరాయ్ లు కూడా ఈ చవితి వీకెండ్ ను వదిలేసి మిస్టేక్ చేసినట్లే. ఇప్పుడు ఎలాగూ వార్ 2 , కూలీ లు స్లో అయ్యాయి కాబట్టి.. ఈ సమయాన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఆ మూడు సినిమాలకు ఉంది.
కానీ ఏ ఒక్కరు ఈ గోల్డెన్ ఛాన్స్ ను వినియోగించుకునేలా కనిపించడం లేదు. సెప్టెంబర్ 5 న అనుష్క ఘాటీ రావడం అయితే పక్కా. కానీ మిరాయ్ మాత్రం మరో వారం వెనక్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్. అంటే సెప్టెంబర్ 12న వచ్చే అవకాశం ఉందట. అదే డేట్ ను బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి కూడా బ్లాక్ చేసుకుంది. ఇలా ఉన్న మంచి అవకాశాలను వదులుకుని అంతా ఒకే సమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్లానింగ్ సరిగా లేకపోవడం వలన ఇలా జరుగుతుందని ఇన్సైడ్ టాక్. ఇక ఇప్పటికైనా ఏమైనా సినిమాలు ప్రీపోన్ అవుతాయేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.