Swetha
ఒకప్పుడు దేవుడు అంటే భయం భక్తి ఉండేవి. తరచూ గుడులకు వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్న జెనెరేషన్ లో ఇవేం కనిపించడం లేదు. దేవుడు అంటే ఓ మూఢనమ్మకం అయిపోయింది. అయితే అలాంటి అపోహలన్నీ తుడిచివేస్తూ దేవుడిని మన పురాణం ఇతిహాస కథలను.. ఇప్పటి జెనెరేషన్ వారు మెచ్చేలా యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ యాడ్ చేసి..
ఒకప్పుడు దేవుడు అంటే భయం భక్తి ఉండేవి. తరచూ గుడులకు వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్న జెనెరేషన్ లో ఇవేం కనిపించడం లేదు. దేవుడు అంటే ఓ మూఢనమ్మకం అయిపోయింది. అయితే అలాంటి అపోహలన్నీ తుడిచివేస్తూ దేవుడిని మన పురాణం ఇతిహాస కథలను.. ఇప్పటి జెనెరేషన్ వారు మెచ్చేలా యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ యాడ్ చేసి..
Swetha
ఒకప్పుడు దేవుడు అంటే భయం భక్తి ఉండేవి. తరచూ గుడులకు వెళ్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్న జెనెరేషన్ లో ఇవేం కనిపించడం లేదు. దేవుడు అంటే ఓ మూఢనమ్మకం అయిపోయింది. అయితే అలాంటి అపోహలన్నీ తుడిచివేస్తూ దేవుడిని మన పురాణం ఇతిహాస కథలను.. ఇప్పటి జెనెరేషన్ వారు మెచ్చేలా యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ యాడ్ చేసి.. ఓ ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి.. దానికి కాస్త మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జోడించి థియేటర్స్ లో రిలీజ్ చేస్తే కాసుల వర్షం కురుస్తుంది. మొన్నీమధ్యనే మిరాయ్ ప్రమోషన్స్ లో తేజ సజ్జాకు ఎదురైనా ప్రశ్న.. ఎందుకు ప్రతి సినిమాలోను డివోషనల్ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నారు అని.
ఒక లవ్ స్టోరీని వెర్షన్స్ మార్చి వేరే వేరే సినిమాలు తీస్తున్నప్పుడు. మన పురాణ ఇతిహాసాలను, ధర్మాలను ఓ అడ్వెంచరస్ యాక్షన్ రూపంలో తీసి చూపిస్తుంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అని చెప్పుకొచ్చాడు. అందులో నిజం లేకపోలేదు.. ఇప్పటి జెనెరేషన్ వారికి అవన్నీ తెలియాలంటే ఇదే సరైన పద్దతి. హనుమాన్ విషయంలో జరిగింది ఇదే.. రేపు రాబోయే చిరంజీవి విశ్వంభరలో జరగబోయేది ఇదే. అలాగే సుదీర్ బాబు జటాధర మీద అంత బడ్జెట్ పెట్టడానికి కారణం కూడా ఈ డివోషనల్ ఎలిమెంట్స్ ఏ. ఇలా చెప్పుకుంటే పోతే ఆల్రెడీ వచ్చిన సినిమాలు.. ఫ్యూచర్ లో రాబోయే సినిమాలు ఇంకా ఎన్నో
ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్ బాగానే కొనసాగుతుంది. ఇది ఎంతకాలం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది అనేది తెలీదు. ఏదేమైనా సినిమాల సక్సెస్ వెనుక దేవుళ్ళ లీల బాగానే పని చేస్తుంది. అటు చూసేవారికి శాటిస్ఫ్యాక్షన్.. ఇటు తీసే వారికి కాసుల వర్షం. మన పురాణ ఇతిహాసాల విలువ అంతకంతకు పెరుగుతూ పోతుంది . ఎవరికైనా ఇంతకుమించి ఏమి కావాలి. ఇప్పటి దర్శక నిర్మాతలు కూడా ఈ సీన్స్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక ముందు ముందు ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.