iDreamPost
android-app
ios-app

మాస్ మహారాజ నుంచి ఈసారి డివోషనల్ యాంగిల్

  • Published Jan 27, 2026 | 10:56 AM Updated Updated Jan 27, 2026 | 10:56 AM

ఈ మధ్యన మాస్ మహారాజ రవితేజ నుంచి వస్తున్న సినిమాలు.. ప్రేక్షకులను అంతలా ఇంప్రెస్స్ చేయడం లేదన్న సంగతి తెలియనిది కాదు. మొన్నీమధ్యన సంగతి రేస్ లో కూడా రవి తేజ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరి హీరోయిన్స్ మధ్యన నలిగిపోయే ఓ హీరో కథ ఇది. సూపర్ గా అలరించింది అని చెప్పలేములే కానీ..

  • Published Jan 27, 2026 | 10:56 AMUpdated Jan 27, 2026 | 10:56 AM
మాస్ మహారాజ నుంచి ఈసారి డివోషనల్ యాంగిల్

ఈ మధ్యన మాస్ మహారాజ రవితేజ నుంచి వస్తున్న సినిమాలు.. ప్రేక్షకులను అంతలా ఇంప్రెస్స్ చేయడం లేదన్న సంగతి తెలియనిది కాదు. మొన్నీమధ్యన సంగతి రేస్ లో కూడా రవి తేజ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరి హీరోయిన్స్ మధ్యన నలిగిపోయే ఓ హీరో కథ ఇది. సూపర్ గా అలరించింది అని చెప్పలేములే కానీ.. రవి తేజ గత సినిమాలతో కంపేర్ చేస్తే ఇది కాస్త బెటర్ అని చెప్పొచ్చు. సో ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకున్నాడేమో ఏమో తెలియదు కానీ ఓ సాలిడ్ పోస్టర్ తో అందరికి షాక్ ఇచ్చాడు రవి తేజ.

మాస్ మహారాజ్ నుంచి ఈసారి డివోషనల్ యాంగిల్ లో సినిమా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న మూవీకి ఇరుముడి టైటిల్ ఫిక్స్ చేస్తూ .. రవితేజ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయ్యప్ప మాలలో పాపాను ఎత్తుకుని చుట్టూ భక్తులతో కనిపిస్తున్నాడు రవితేజ. ఈ మధ్య కాలంలో డివోషనల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. అందులోను అయ్యప్ప మాల ధరించి సినిమాలు చేసిన హీరోలు తక్కువ. సరిగ్గా ఈ ఏడాది ఆఖరిలో కనుక ఈ సినిమాను రిలీజ్ చేస్తే.. సక్సెస్ అయ్యే ఛాన్స్ లు బాగానే కనిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కంప్లీట్ గా డివోషనల్ సైడ్ టచ్ చేయకుండా.. లోపల కాస్త రివెంజ్ డ్రామాని కూడా ఇంక్లూడ్ చేశారట. ఒకవేలే ఇది కనుక క్లిక్ అయితే తెలుగుతో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి . ముందు ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.