iDreamPost
android-app
ios-app

థియేటర్స్ బంద్ వివాదంపై బన్నీ వాసు లేటెస్ట్ ట్వీట్..

  • Published Jun 06, 2025 | 2:06 PM Updated Updated Jun 06, 2025 | 2:06 PM

తెలుగు ఇండస్ట్రీలో థియేటర్స్ బంద్ వివాదం కొనసాగుతూనే ఉంది. గత కొద్దీ రోజులుగా ఈ విషయంపై ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయో తెలియనిది కాదు. ఈ సమస్య గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

తెలుగు ఇండస్ట్రీలో థియేటర్స్ బంద్ వివాదం కొనసాగుతూనే ఉంది. గత కొద్దీ రోజులుగా ఈ విషయంపై ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయో తెలియనిది కాదు. ఈ సమస్య గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

  • Published Jun 06, 2025 | 2:06 PMUpdated Jun 06, 2025 | 2:06 PM
థియేటర్స్ బంద్ వివాదంపై బన్నీ వాసు లేటెస్ట్ ట్వీట్..

ఓ వైపు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కానీ మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో థియేటర్స్ బంద్ వివాదం కొనసాగుతూనే ఉంది. గత కొద్దీ రోజులుగా ఈ విషయంపై ఎలాంటి చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయో తెలియనిది కాదు. ఈ సమస్య గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు.

‘ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది.. కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. అలాగే సినిమా విడుదలైన 28 రోజుల్లోపే OTTకి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే.. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకో, మూడు సంవత్సరాలో ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలామంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు బన్నీ వాసు.

అయితే బన్నీ వాసు చెప్పిన మాటల్లో వాస్తవాలు లేకపోలేదు. ఈ మధ్య కాలంలో భారీగా క్రౌడ్ పుల్లింగ్ చేసిన సినిమా ఇది.. అని చెప్పుకునేలా ఒక్క సినిమా కూడా రాలేదు. అలాగే ప్రేక్షకులు కూడా OTT లకు ఎక్కువ అలవాటు పడడంతో థియేటర్స్ కు కొంత మేర నష్టం జరుగుతుంది. వీటి అన్నిటిని దృష్టిలో ఉంచుకుని బన్నీ వాసు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. దీనితో ఈ ట్వీట్ ఇప్పుడు కొత్త చర్చలకు దారితీసింది. రానున్న రోజుల్లో ఈ బంద్ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom