Swetha
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు తమ తమ లక్ ను పరీక్షించుకున్నాయి . అయితే టాప్ లెవెల్ లో ఆడతాయి అనే సినిమాలు నీరుకారిపోవడం , అసలు ఎలాంటి అంచనాలను పెట్టుకోని సినిమాలు ఊహించని విధంగా హిట్ అందుకోవడం ఆశ్చర్యం .
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు తమ తమ లక్ ను పరీక్షించుకున్నాయి . అయితే టాప్ లెవెల్ లో ఆడతాయి అనే సినిమాలు నీరుకారిపోవడం , అసలు ఎలాంటి అంచనాలను పెట్టుకోని సినిమాలు ఊహించని విధంగా హిట్ అందుకోవడం ఆశ్చర్యం .
Swetha
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలు తమ తమ లక్ ను పరీక్షించుకున్నాయి . అయితే టాప్ లెవెల్ లో ఆడతాయి అనే సినిమాలు నీరుకారిపోవడం , అసలు ఎలాంటి అంచనాలను పెట్టుకోని సినిమాలు ఊహించని విధంగా హిట్ అందుకోవడం ఆశ్చర్యం . వీటి అన్నిటిలో 2025 లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను కాలర్ ఎగరేసుకునేలా చేసిన సినిమాలు ఏంటో దాని వెనుక కారణలేంటో చూసేద్దాం.
వాటిలో ముందు వరుసలో ఉన్న సినిమా పవన్ కళ్యాణ్ నటించిన ఓజి. అసలే పవర్ స్టార్ ను తెరమీద చూసి చాలా రోజులు అయింది. అందులోను ఓ ఫ్యాన్ బోయ్ రుపోయిందించిన సినిమా కాబట్టి అంచనాలు గట్టిగానే ఉండేవి. దీనితో ఓపెనింగ్స్ కూడా గ్రాండ్ గానే అయ్యాయి . అలా మొత్తానికి మూవీ థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఏకంగా రూ.302 కోట్ల గ్రాస్ వసూళ్లను బుట్టలో వేసుకుందట. సో ప్రస్తుతానికి 2025 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇక ఇది కాకుండా ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను స్టార్ట్ చేసి.. రికార్డ్స్ దున్నేసిన సంక్రాతి వస్తున్నాం రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ రూ.197 కోట్ల గ్రాస్ వసూళ్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది . కాకపోతే బడ్జెట్ ఎక్కువ పెట్టడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మూడు నెలల క్రితం వచ్చిన తేజ సజ్జ మిరాయ్ సినిమా రూ.142 కోట్ల గ్రాస్ వసూళ్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత సినిమాలే లేక డీలా పడిన థియేటర్స్ లో జోష్ నింపిన కుభేర రూ.138 కోట్ల గ్రాస్ వసూళ్లతో 5 స్థానంలో నిలిచింది. ఇలా ఈ ఏడాది రిలీజ్ అయినా సినిమాలలో ఈ ఐదు సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇక వచ్చే ఏడాది ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.