iDreamPost
android-app
ios-app

చదలవాడ శ్రీనివాసరావు తో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆత్మీయ సమావేశం

  • Published Feb 26, 2026 | 6:43 PM Updated Updated Feb 26, 2026 | 6:43 PM

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నిక అయిన పాలకమండలి మరియు ఈసీ మెంబెర్స్ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ను కలిశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పునర్ వైభవానికి దారిని పరిచిన చదలవాడ శ్రీనివాసరావు గారిని కలిసి ఆత్మీయతా కృతజ్ఞతలు తెలియ చేశారు

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నిక అయిన పాలకమండలి మరియు ఈసీ మెంబెర్స్ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ను కలిశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పునర్ వైభవానికి దారిని పరిచిన చదలవాడ శ్రీనివాసరావు గారిని కలిసి ఆత్మీయతా కృతజ్ఞతలు తెలియ చేశారు

  • Published Feb 26, 2026 | 6:43 PMUpdated Feb 26, 2026 | 6:43 PM
చదలవాడ శ్రీనివాసరావు తో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆత్మీయ సమావేశం

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నిక అయిన పాలకమండలి మరియు ఈసీ మెంబెర్స్ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ను కలిశారు.
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పునర్ వైభవానికి దారిని పరిచిన చదలవాడ శ్రీనివాసరావు గారిని కలిసి ఆత్మీయతా కృతజ్ఞతలు తెలియ చేశారు

ఈ ఆత్మీయ సమావేశంలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ” కొంతకాలంగా సబ్దంగా ఉన్న అసోసియేషన్ కు శ్రీనివాసరావు గారి ప్రకటన తిరిగి జీవం పోసింది. కొందరి జేబులో కోటిరూపాయల ఉన్నా మనసులో దరిద్రం వుంటుంది. శ్రీనివాసరావు గారి జేబులో కోట్లు ఉన్నాయి మనసులో లక్ష్మిదేవి ఉంది. పదిమంది కి ఉపయోగపడే ఔదార్యం ఉంది. కుబేరుడు ఇంతమంది కుచేలుల్లను అనుగ్రహించారు. ఫిల్మ్ జర్నలిస్టులు గా దశాబ్దాల అనుబంధం ఉంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లలో ఓ ఆరోగ్యకర వాతావరణం నెలకొని ఉంది.మనం గాసిప్స్ ను ప్రోత్సహించం. కాంట్రవర్సీ లు ప్రచురించం .పరిశ్రమ లో జరిగే అవకతవకలును
చెత్త సినిమాలను ఉపేక్షించం. చదలవాడ తిరుపతిరావు గారి కుటుంబం ఫిల్మ్ క్రిటిక్స్ ను కుటుంబ సభ్యులు లా చూస్తారు. మన పట్ల వారు చూపిస్తున్న ఆప్యాయత,ఆదరణ పలకరింపులో మాటలకు అందని తియ్యదనం ఉంది..చదలవాడ శ్రీనివాసరావు గారివలనే మనం అందరం సంఘటితం కాగలిగాం. మన అందరి కళ్ళలో వెలుగుకు కారణం అయ్యారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు.
అధ్యక్షుడు బత్తుల జెవి ప్రసాద్ రావు మాట్లాడుతూ ప్రతిరోజు శ్రీనివాసరావు గార్కి పాదాభివందనం చెయ్యటం నాదినచర్యలో భాగం.నేను సినిమా పరిశ్రమకు ,పాత్రికేయ వృత్తికి కొంతకాలం దూరంగా ఉన్నాను. శ్రీనివాసరావు గారిని కలిస్తే హైదరాబాద్ వచ్చేయి.ఇక్కడ ఉండిపో అన్నారు.నాకు కావాలంటే ఆయన సకల సదుపాయాలు కల్పిస్తారు.కానీ నాకు ప్రకృతిలో జీవించటం ఇష్టం అందుకే ఒక చిన్న కుటీరం కట్టించి ఇచ్చారు. వారు మన సినీ పాత్రికేయులు తన కన్నకొడుకులు లా చూస్తారు. ఎవరు వచ్చినా ఇదంతా ప్రసాద్ దే అని చెపుతారు . వారి అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు.

ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ శ్రీనివాసరావు గారి ఔదార్యం వర్ణించటానికి మాటలు చాలవు. ఆయన చేస్తున్న గొప్ప పని చరిత్రలో నిలిచిపోతుంది డబ్బులు ఉన్న ప్రతిమనిషి దాన గుణం ఉండదు. దాన గుణం ఉన్నవారివద్ద డబ్బులు ఉండవు.రెండు ఒకరి వద్దే ఉండటం చాలా అరుదు.అలా అరుదైన మంచి మనిషి శ్రీనివాసరావు గార్కి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు అంతా ఋణ పడి వుంటారు అన్నారు.

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు సీనియర్ సభ్యులు మోహన్ గొటేటి మాట్లాడుతూ
శ్రీనివాసరావు బ్రదర్స్ దృష్టిలో సినిమా పాత్రికేయులుకు గొప్ప ఆదరణ ఉంది. ఓరోజు నేను స్వీట్స్ కోసం బేగం పేట్ లోని పుల్లారెడ్డి స్వీట్స్ కు వెళ్ళాను.అక్కడకు ఇద్దరు అన్నతమ్ములు వచ్చారు.నన్ను చూసి మోహన్ ఏంటి ఇక్కడ అని ప్రశ్నించారు. స్వీట్స్ కోసం వచ్చాను సర్ అనేసరికి తిరుపతి రావు గారు పుల్లారెడ్డి మనకు బాగా తెలుసు ఉండు అని లోపలకు వెళ్ళి నాలుగు అయిదు కేజీల స్వీట్స్ తెచ్చి చేతుల్లో పెట్టేశారు. మా ఇంటి గృహ ప్రవేశానికి కూడా వచ్చి ఆశీర్వదించారు. వారి మంచితనానికి తలవంచి నమస్కరిస్తున్నాను. అన్నారు

మరో సీనియర్ సభ్యులు బాలి రెడ్డి మాట్లాడుతూ… దైవం మానుష రూపేణా అని అంటారు. ఈ వాక్యానికి నడిచే నిర్వచనం శ్రీనివాసరావు గారు.వీరు చేస్తున్న బృహత్కార్యం తెలుగు సినిమా పరిశ్రమ కే కాదు దక్షిణాది సినిమా పరిశ్రమ లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక చరిత్ర గా నిలిచిపోతుంది.తెలుగు పరిశ్రమ లో ఎంతో అభిమానం ఆదరణ ఉన్న NTR ,ANR స్థాయికి ఈ ఒక్క కార్యంతోశ్రీనివాసరావు గారు చేరారు.వారు చేస్తున్న మంచి పని మనం ఊరు వాడ దండోరా వెయ్యాలి అన్నారు

ఉపాధ్యక్షులు E జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసరావు గారు చేస్తున్న సత్కార్యానికి ఫిలిం క్రిటిక్స్ కుటుంబం జీవితాంతం ఋణ పడి ఉంటుంది వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు అన్నారు

ఈ కార్యక్రమానికి కారణం అయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ మిత్రులు,పుత్రులు సినీ పాత్రికేయులు.నాకు బంధువులు ఆత్మ బంధువులు సినిమా పాత్రికేయులు.నాకు సినిమాలు అంటే గొప్ప అభిమానం . సినిమా పాత్రికేయులు శిల్పి వంటివారు.రాతిని శిల్పంలా చెక్కుతారు. ఆ శిల్పాన్ని చూసి అందరూ మొక్కుతారు. అలానే సాధారణ వ్యక్తిలుగా సినిమా పరిశ్రమకు వచ్చే హీరోలను, దర్శకులను,నిర్మాతలను ప్రజల గుండెలలో స్థిరమైన స్థానం కల్పించేవి మీ రాతలే! అందువల్లే మీరు అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఒక సైంటిస్ట్ , ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నవారు సమాజానికి ఎలా ఉపయోగపడతారో అలానే సినిమా పాత్రికేయులు వలన కూడా సమాజానికి ఎంతో ఉపయోగం .సినిమా మీద ప్రేమతో 80 వ దశకంలో మేము తీసిన మొదటి సినిమా లైలా ఆ సినిమా నిర్మాణం కోసం తెనాలి నుండి చెన్నై వెళ్లినప్పుడు నన్ను మొదట రిసీవ్ చేసుకుంది కొండపనేని ఉమామహేశ్వరరావు, మిక్కిలినేని జగదీష్ బాబు ఆ రోజు నుండి వాళ్ళే నాకు ఆత్మీయులు బంధువులు. ఆ రోజుల్లో ఓ టాప్ హీరో సినిమా ఆడియో రైట్స్ లియో ఆనంద్ లక్ష రూపాయలు కు కొనుగోలు చేశారు . నా సినిమా లైలా కు ఆత్రేయగారు నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు. MS విశ్వనాథ్ మ్యూజిక్. లియో ఆనంద్ మా సినిమా పాటలు విని 99 వేలు ఆడియో రైట్స్ కు ఆఫర్ చేశారు .ఉమా , జగదీష్ బాబు ఇద్దరు లియో ఆనంద్ ను మా ఆఫీస్ కు పిలిపించి మీరు టాప్ హీరో సినిమా కు లక్ష రూపాయలు ఇచ్చారు .అంతకంటే ఈ సినిమా పాటలు బాగున్నాయి కాబట్టి లక్ష వెయ్యి రూపాయలు ఇవ్వండి అని ఇప్పించారు. నాగేశ్వరరావు గారి తో శోభన్ బాబు తో సినిమాలు తీశాను. ప్రతి సినిమా నిర్మాణం లోను స్వంత అన్నదమ్ములు లా సినిమా పాత్రికేయులు మా మీద అభిమానం చూపించారు. ఏ రోజు నేను వారిని ఇలా రాయండి అని అడగ లేదు.వారి స్వంత సినిమా లా భావించి నేను తీసిన ప్రతి సినిమా ను వారే ప్రచారం చేశారు.. మీరంతా నా స్వంత బిడ్డల లా భావిస్తాను.నేను ఊరుకు దూరంగా ఈ స్థలం కొన్నప్పుడు ఇందులో నా కుటుంబానికి చెందిన పాత్రికేయ మిత్రులకు కూడా భాగం ఇవ్వాలి అనుకున్నా కానీ అనాడు ఈ స్థలం ఊరికి దూరంగా ఉండటంతో మార్కెట్ ధర ప్రకారం డబ్బులు ఇవ్వమని అడిగారు.ఇచ్చాను. మీకు ఇల్లు కట్టి ఇవ్వలేక పోయాను అయ్యో వీళ్ళు ఉపయోగించుకోలేదు…. ఉపయోగించుకోలేదు అని నా మనసులో ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది. అలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను రకరకాల పని వత్తిడిలో పడిపోయాను .ప్రతిరోజూ రీటా ప్రసాద్ ఉదయాన్నే కనిపించగానే మనవారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకునే వాన్ని.ఒక రోజు మీ అందరితో కలిసి భోజనం చెయ్యాలని ఉంది అందరూ వస్తారా? అని అడిగితే వస్తారు అని మిమ్మలను పిలిచాడు ఆ సమావేశానికి అన్నయ్య కూడా వచ్చారు.నేను ఇచ్చింది ఏమి లేదు. మీరు నామీద చూపించే అభిమానం తో దేవుడు నా నోటి నుండి మీకు టవర్స్ కట్టి ఇస్తాను అనే మాట అనిపించాడు. అది వందకోట్లు విలువైనది అయినా మూడు వందల కోట్లు విలువైనది అయినా ఒక్క సారి మాట ఇస్తే చెప్పింది చేస్తాను.నేను ఒక్కసారి మాట అన్నాక అటు సూర్యుడు ఇటు పొడిచినా మాట తప్పను. నేను అన్నదానికంటే 10 / శాతం ఎక్కువే ఖర్చు పెట్టీ కట్టించి ఇస్తాను.ఏడు తరాల నుండి మాది ఉమ్మడి కుటుంబం.మేము మాట ఇచ్చాం అంటే కుటుంబ సభ్యులు అందరం అన్నయ్య కానీ పిల్లలు కానీ అందరం కట్టుబడి వుంటాం. నేను సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించాను దేవుడు నాకు ఇంత ఇస్తాడు అని భావించలేదు.ఇచ్చాడు అందులో కొంత మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇస్తున్నాను. సినిమా కార్మికులు కూడా మీలా నా కుటుంబ సభ్యులు చిత్రపురి కాలనీ స్థలం వేలం దశకు వస్తే ప్రసన్న కుమార్,దర్శకుడు అజయ్ కుమార్ అనిల్ ను నావద్దకు తెచ్చారు. ఆ సమయంలో నేను అంత స్థితిమంతుడను కూడా కాదు.అయినా సరే మంచి పని వారికి మాట ఇచ్చాను.భగవంతుడు కూడా నాకు శక్తి ఇచ్చాడు. 4500 కుటుంబాలలో వెలుగు నింపటం కోసం మాట ప్రకారం బ్యాంక్ వారికి డబ్బులు కట్టాను. ఇలా మంచిచేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ రోజు చిత్రపురి కాలనీ ఎకరం 20 కోట్లు ఈ రోజు 200 కోట్లు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులు ఎవరు నేను చేసే మంచిపనులు ను చూసి ఆనందిస్తారు.కొన్ని మంచి కార్యాలను డబ్బులతో కోలవలేం అలానే అనుబంధం కూడా డబ్బులకు అతీతమైనది. మీ అందరూ నా స్వంత బిడ్డల లాంటివాళ్ళు మీకు చేస్తాను అన్నదానికంటే ఎక్కువ చేస్తాను అన్నారు.

మరో సీనియర్ సినిమా పాత్రికేయుడు గిరిధర్ మాట్లాడుతూ చదలవాడ శ్రీనివాసరావు ఇంతకాలం నాకు మాత్రమే దేవుడు.. ఈ మంచి పనితో మన అందరికి దేవుడు అయ్యారు అన్నారు

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet