ఆచార్యకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య మంచి డిబేటబుల్ టాపిక్ అయ్యింది. నిజానికిది సడన్ గా తీసుకున్న నిర్ణయం. కథలో ఉన్న ధర్మస్థలిని పరిచయం చేసే సన్నివేశాలు ప్లస్ రెండు మూడు సీన్లకు మాత్రమే ప్రిన్స్ గొంతు ఉంటుంది. అంతే తప్ప సినిమా పొడవునా కాదు. సర్కారు వారి పాట పనుల్లో బిజీగా ఉన్నా కూడా దీనికి ఎందుకు ఒప్పుకున్నాడనే డౌట్ రావడం సహజం. దానికి కారణాలు ఉన్నాయి. శ్రీమంతుడు, […]
ఉట్టి విజువల్ గ్రాండియర్స్ అంటూ ప్రచారంలో ఊదరగొడుతూ కథా కథనాలను నిర్లక్ష్యం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో సాహో, రాధే శ్యామ్ లు నిరూపించాక డార్లింగ్ ప్రభాస్ కి తత్వం బోధపడినట్టు ఉంది. తన ప్యాన్ ఇండియా ఇమేజ్ డ్యామేజ్ కావడానికి ఇలాంటివి ఇంకో రెండొస్తే చాలానే క్లారిటీ వచ్చేసింది. అందుకే మెల్లగా కమర్షియల్ డైరెక్టర్స్ మీద దృష్టి సారిస్తున్నాడు. అందులో భాగంగానే త్వరగా పూర్తి చేసే షరతు మీద దర్శకుడు మారుతీకి రాజా డీలక్స్ (ప్రచారంలో […]
ఏ ఉద్దేశంతో ట్రిపులార్ తర్వాతే ఆచార్య విడుదల ఉండాలని రాజమౌళి కండీషన్ పెట్టాడో కానీ అది ఇప్పుడది కొణిదెల అండ్ మ్యాట్నీ సంస్థలకు వరంగా మారబోతోంది. అల్లూరి సీతారామరాజు గెటప్ ని నార్త్ ఆడియన్స్ శ్రీరాముడిగా భావించడం వల్ల అక్కడ రామ్ చరణ్ ఇమేజ్ ఉన్నట్టుండి ఎగబాకింది. దానికి తోడు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అదిరిపోవడంతో ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. జంజీర్ లో చూసింది ఇతన్నేనా అని సీనియర్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. కొంత అతిశయోక్తిగా […]
నాలుగేళ్ల నిరీక్షణకు ఫలితంగా అద్భుతమైన బ్లాక్ బస్టర్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ జూన్ నుంచి కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కాబోయే సినిమా తాలూకు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే చాలా లేట్ కావడంతో అభిమానులు త్వరగా మొదలుపెట్టామని ఒత్తిడి చేస్తున్నారు. ఆచార్య రిలీజ్ అయితే తప్ప కొరటాల ఫ్రీ కాలేరు. ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం ఎందుకని పక్కా ప్లానింగ్ తో మూడు నెలల తర్వాత స్కెచ్ వేశారు. దీని తర్వాత […]
ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ సైరా తర్వాత దాదాపు మూడేళ్ళకు పైగా నిర్మాణంలోనే ఉన్న ఆచార్య విడుదలకి అడ్డంకులు తొలగిపోలేనట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లో రావాలని గట్టిగా అనుకున్నారు. కానీ పుష్ప కోసం త్యాగం చేశారు. తీరా చూస్తే అది ఊహించిన దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక్కడ హిట్ అవ్వడంలో విశేషం లేదు కానీ నార్త్ లో తెగ ఆడేసి ఐకాన్ స్టార్ కి ఓ మార్కెట్ ని సృష్టించింది. […]
పాన్ ఇండియా సినిమాలేవీ ఈ పండక్కు బరిలో లేకపోయినా వాటి తాలూకు వివాదాలు మాత్రం వార్తల్లో షురూ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ లో సీతారామరాజు పాత్రను తప్పుగా చూపించారని, బ్రిటిష్ సైన్యంలో తొలుత పని చేసిన పోలీసుగా చూపించడం సబబుగా లేదని, అంతేకాదు అసలు సీత అనే యువతికి రామరాజుకి మధ్య ప్రేమకథ లేదని, కోరుకున్నవాడి కోసం ఆమే ప్రాణ త్యాగం చేసిందని తాజాగా కోర్టులో వేసిన పీల్ లో పై అంశాలను పేర్కొన్నారు. అల్లూరి వంశానికి చెందిన […]
పరిస్థితులు ఎప్పటికప్పుడు మన చేతుల్లో ఉన్నా లేకపోయినా భారీ సినిమాలకు ఒక ప్లానింగ్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే అయ్యో పాపం అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆచార్య ఇదే స్టేజిలో ఉంది. ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయక్ తప్పుకుంది. ఎందుకొచ్చిన గొడవని సర్కారు వారి పాట ఎప్పుడో వాయిదా వేసుకుంది. పుష్ప రిస్క్ వద్దనుకుని డిసెంబర్ లో రావడం దాన్ని బ్లాక్ బస్టర్ చేసింది. తీరా చూస్తే ఇప్పుడు సంక్రాంతి బరిలో పెద్ద సినిమా అంటే రాధే […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శత్వంలో రూపొందుతున్న ఆచార్య ముందు చెప్పిన ఫిబ్రవరి 4 కాకుండా విడుదల వాయిదా పడొచ్చని జరుగుతున్న ప్రచారానికి నిన్న స్వయానా నిర్మాతలే బ్రేక్ వేయాల్సి వచ్చింది. పోస్ట్ పోన్ లేదని చెప్పినట్టుగానే డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అసలు ఉన్నట్టుండి ఈ ప్రచారం ఎలా జరిగిందనే అనుమానం అభిమానుల్లో కలిగింది. దానికి కారణాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు […]
ముందు చెప్పుకున్న ఖచ్చితమైన రిలీజ్ డేట్లకు ఎవరూ కట్టుబడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇవాళ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన ఎఫ్3 పోస్టర్, వీడియో టీజర్ రెండింటిలోనూ విడుదల తేదీని తీసేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో 2022 ఫిబ్రవరి 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సంగతి ప్రస్తావించకుండా ప్రోమోలు కట్ చేయడం చూస్తే పోస్ట్ పోన్ ఉండొచ్చేమోనన్న ప్రచారానికి బలం చేకూరింది. రెండు […]