iDreamPost
android-app
ios-app

Devara Record: దేవర ఖాతాలో అరుదైన ఘనత! తొలి భారతీయ చిత్రంగా రికార్డు..

  • Published Sep 13, 2024 | 12:10 PM Updated Updated Sep 13, 2024 | 12:10 PM

Devara movie premiere at Beyond Fest: దేవర ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరనుంది. దాంతో ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా దేవర నిలవనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Devara movie premiere at Beyond Fest: దేవర ఖాతాలో ఓ అరుదైన ఘనత చేరనుంది. దాంతో ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా దేవర నిలవనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Devara Record: దేవర ఖాతాలో అరుదైన ఘనత! తొలి భారతీయ చిత్రంగా రికార్డు..

‘దేవర’ గత కొన్ని రోజులగా ఎక్కడ చూసిన ఈ పేరే వినిపిస్తోంది, కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది. ట్రైలర్ లో తారక్ యాక్షన్ చూసి పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. ఇందులోనే ఈ రేంజ్ లో ఉందంటే.. ఇక సినిమాలో ఏ రేంజ్ ఊచకోత ఉంటుందో అని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దేవర ఖాతాలో అరుదైన ఘనత చేరింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’ రిలీజ్ కు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దాంతో బాక్సాఫీస్ వద్ద తారక్ ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తాడా? అంటూ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ఖాతాలో ఓ అరుదైన ఘనత వచ్చి చేరనుంది. అదేంటంటే?.. ‘బియాండ్ ఫెస్ట్’ను హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇలాంటి ఈవెంట్ లో దేవర ను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 26న లాస్ ఏంజెల్స్ లోని ఐకానిక్ థియేటర్ ఈజిప్షియన్ థియేటర్ లో సాయంత్రం 6:30  గంటలకు దేవర మూవీని ప్రదర్శించనున్నారు.

కాగా.. హాలీవుడ్ లో బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శింపబడుతున్న తొలి ఇండియన్ సినిమా దేవర కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం కూడా ఈ ఫెస్ట్ లోకి రాలేదు. ఇప్పుడు ఆ రికార్డును దేవర సొంతం చేసుకున్నాడు. ఇక బియాండ్ ఫెస్ట్ కు ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. దాంతో దేవరకు హాలీవుడ్ రేంజ్ లో పబ్లిసిటీ దొరకడం ఖాయం. దాంతో తన ఓవర్సీస్ మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు తారక్ కు ఇది మంచి ప్లాట్ ఫామ్. పైగా తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు దేవర కూడా వారికి నచ్చితే.. అక్కడి మార్కెట్ లో మంచి  పబ్లిసిటీ దొరికినట్లే. దాంతో ఆర్ఆర్ఆర్ మాదిరిగానే దేవర కూడా గ్లోబల్ రేంజ్ లో సత్తాచాటే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం తారక్ అండ్ కో దేవర ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రధానంగా నార్త్ ఆడియెన్స్ ను టార్గెట్ గా చేసుకుని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరి దేవర ఖాతాలో ఈ అరుదైన  ఘతన చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.