iDreamPost
android-app
ios-app

దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Sep 25, 2024 | 7:02 PM Updated Updated Sep 25, 2024 | 7:02 PM

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర ఒకే చేశారు. ప్రస్తుతం దేవర విడుదలకు సిద్ధంగా ఉంది.

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర ఒకే చేశారు. ప్రస్తుతం దేవర విడుదలకు సిద్ధంగా ఉంది.

దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై KTR ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అలా చాలా జాగ్రత్తలు తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివతో ‘దేవర’ ఒకే చేశారు. ప్రస్తుతం దేవర పార్ట్-1 విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాల ఉన్నాయి.ఈ సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 22న చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరపాలని భావించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వాహకులు క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే.

అభిమానులు ఎక్కువగా రావడంతో ఈవెంట్ రద్దు అయింది. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. ఆరు సంవత్సరాల తరువాత తమ అభిమాన హీరో సోలో సినిమా వేడుక క్యాన్సిల్ కావడంతో అభిమానులు అప్సెట్ అయ్యారు. ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులకు తారక్ క్షమాపణలు కూడా చెప్పారు. ఈవెంట్ క్యాన్సిల్ కి ఆర్గనైజర్స్, నిర్మాతలను తిట్టడం సరికాదని తెలిపారు.ఈ సినిమా కాలర్ ఎగరేసేలా ఉంటుందని గతంలో చెప్పి అంచనాలు పెంచారు తారక్. నిర్మాతలు కూడా ఫ్యాన్స్ నుంచి క్షమాపణలు కోరారు. ఇంకా అలాగే ఈ ఈవెంట్ బాధ్యతలు తీసుకున్న శ్రేయాస్ మీడియా సీఈవో.. రద్దు వెనుక కారణాల గురించి వివరించారు.

ఇదిలా ఉండగా తాజాగా ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దుపై బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఫతేనగర్‌ బ్రిడ్జ్‌ని కేటీఆర్‌ సందర్శించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ దేవర ప్రీ రిలీజ్ రద్దుపై స్పందించారు. తమ ప్రభుత్వం ఉంటే దేవర ఈవెంట్‌ ఫంక్షన్‌ చాలా బాగా జరిగేదని ఆన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు చేశారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పోలీసులు చేతులెత్తేశారని, తాము అధికారికంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లు ప్రశాంతంగా జరుపుకునే వాళ్లని కేటీఆర్ అన్నారు. తాము సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా జరిపామని ఆయన వ్యాఖ్యలు చేశారు.