iDreamPost
android-app
ios-app

Daavudi Song: తారక్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేశారా? కారణం ఏంటంటే?

  • Published Sep 17, 2024 | 10:22 AM Updated Updated Sep 17, 2024 | 10:22 AM

Daavudi Song removed from Devara movie?: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్.. చాట్ బస్టర్ గా నిలిచిన దావూదీ సాంగ్ ను మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. మరి నిజంగానే ఈ సాంగ్ ను తీసేశారా? ఇప్పుడు తెలుసుకుందాం.

Daavudi Song removed from Devara movie?: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్.. చాట్ బస్టర్ గా నిలిచిన దావూదీ సాంగ్ ను మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. మరి నిజంగానే ఈ సాంగ్ ను తీసేశారా? ఇప్పుడు తెలుసుకుందాం.

Daavudi Song: తారక్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేశారా? కారణం ఏంటంటే?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. బాలీవుడ్ లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. దూసుకెళ్తున్నారు. ఇక తారక్ ఫ్యాన్స్ కూడా మూవీని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూడాలా? అని తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది. చాట్ బస్టర్ గా నిలిచిన దావూదీ సాంగ్ మూవీ నుంచి తీసేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. మరి నిజంగానే ఈ సాంగ్ ను తీసేశారా? ఇప్పుడు తెలుసుకుందాం.

దేవర నుంచి విడుదలై మూడు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఫియర్, చుట్టమల్లే సాంగ్ లతో పాటుగా మూడో సింగిల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన దావూదీ పాట సైతం చాట్ బస్టర్ గా నిలిచింది. మిలియన్ల కొద్ది వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేశాయి ఈ త్రీ సాంగ్స్. అయితే కొన్ని రోజుల క్రితం దావూదీ సాంగ్ పై ఓ న్యూస్ గట్టిగా వినిపించింది. ఈ పాట సినిమాలో ఉండదని, ఎండింగ్ కార్డ్స్ పడే టైమ్ లో వస్తుందని వార్తలు వచ్చాయి. దాంతో హమ్మయ్య కనీసం అప్పుడైనా పాటను చూడొచ్చని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఇలాంటి టైమ్ లో బాంబ్ లాంటి న్యూస్ తారక్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతోంది. దావూదీ సాంగ్ ఎండ్ టైటిల్ పడే సమయంలోనే కాకుండా.. అసలు మూవీ నుంచే తీసేసినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది.

దావూదీ సాంగ్.. దేవర నుంచి వచ్చిన మూడో పాటకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సాంగ్ లో తారక్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోయింది. మాస్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించాడు తారక్. దానికితోడు జాన్వీ స్టెప్పులు, అందాలు కూడా సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఈ పాట యూట్యూబ్ ను అల్లాడిస్తూ.. మిలియన్ల కొద్ది వ్యూస్ తో అదరగొట్టేసింది. ఇలాంటి సాంగ్ ను థియేటర్లలో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ.. ఇప్పుడు ఆ సాంగ్ ను మూవీ నుంచి కట్ చేశారని తెలుస్తుండటంతో.. ఫ్యాన్స్ నిరాశకు గురౌతున్నారు. అయితే ఇది మూవీ యూనిట్ నుంచి వచ్చిన అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ.. ఇండస్ట్రీలో మాత్రం దీని గురించి గట్టిగానే వినిపిస్తోంది. అయితే సాంగ్ ను ఎందుకు తీసేశారు అన్న విషయం మాత్రం తెలియడం లేదు. బహుశా రన్ టైమ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొన్ని సీన్లతో పాటుగా ఈ సాంగ్ ను కూడా కట్ చేసి ఉంటారని మూవీ లవర్స్ భావిస్తున్నారు. మరి దావూదీ సాంగ్ మూవీ నుంచి కట్ చేశారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by NBUR (@naku_bhutulu_urike_ravuu)

jojobet girişgamdomCasibomjojobetJojobet Girişjojobet güncel giriş