iDreamPost
android-app
ios-app

Devara: దేవర ఎఫెక్ట్.. ముందే జాగ్రత్త పడుతున్న పుష్పరాజ్!

  • Published Sep 24, 2024 | 8:03 AM Updated Updated Sep 24, 2024 | 8:03 AM

Devara Movie, Pushpa 2: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో.. ఫ్యాన్స్ నిరాశకు లోనౌతున్నారు. అయితే ఈ తప్పు జరగకుండా పుష్ప 2 మేకర్స్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Devara Movie, Pushpa 2: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో.. ఫ్యాన్స్ నిరాశకు లోనౌతున్నారు. అయితే ఈ తప్పు జరగకుండా పుష్ప 2 మేకర్స్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 24, 2024 | 8:03 AMUpdated Sep 24, 2024 | 8:03 AM
Devara: దేవర ఎఫెక్ట్.. ముందే జాగ్రత్త పడుతున్న పుష్పరాజ్!

ఏపీ, తెలంగాణలోనే కాక.. దేశవ్యాప్తంగా దేవర ఫీవర్ నడుస్తోంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు అంతకు అంతకు పెరుగుతున్నాయి. ఇక సెప్టెంబర్ 22 ఆదివారం నాడు గ్రాండ్ గా దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ.. క్లోజ్డ్ ఆడిటోరియం కావడం, ఊహించిన దాని కంటే రెండు రాష్ట్రాల నుంచి తారక్ అభిమానులు పోటెత్తడంతో.. ఫంక్షన్ దగ్గర యుద్ధవాతావరణం నెలకొంది. కొందరినే లోపలకి పంపివ్వడంతో.. మిగతా ఫ్యాన్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో పరిస్థితి చేయిదాటిపోతుందని గ్రహించిన అధికారులు, మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురైయ్యారు. ఇక దేవర ఎఫెక్ట్ తో పుష్పరాజ్ ముందే జాగ్రత్తపడుతున్నట్లు తెలుస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ 27న బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు మూవీ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రాబోతున్న దేవర రిలీజ్ కు ముందే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ప్రసాద్ ఐమాక్స్ లో అయితే నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. కాగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో.. ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక దేవర ప్రీ రిలీజ్ రద్దు ఎఫెక్ట్ తో ముందే మేల్కొంటున్నారు పుష్ప 2 మేకర్స్.

తొలుత దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఓపెన్ ఏరియాలో నిర్వహించడానికి ప్రణాళికలు వేశారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో నోవాటెల్ కు షిప్ట్ చేశారు. కానీ.. తారక్ ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల నుంచి ఊహించని విధంగా పోటెత్తడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్త రద్దు అయిన విషయం తెలిసిందే. ఇక ఇది చూసిన పుష్ప 2 మేకర్స్.. తమ సినిమా విషయంలో ఇలా జరగకూడదని ముందే ప్లాన్స్ వేస్తున్నారు. ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే బన్నీ అండ్ కో జాగ్రత్త పడుతున్నారు. ఫ్యాన్స్ ను నిరాశపరచకుండా ఈ విషయాన్ని నిర్మాత రవి శంకర్ చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న పుష్ప 2.. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి దేవర పరిస్థితిని చూసి ముందే మేల్కోంటున్న పుష్పరాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş