iDreamPost
android-app
ios-app

Devara: దేవర.. ఆ ఒక్క ట్విస్ట్ కు దిమ్మ తిరిగి పోవాల్సిందే!

  • Published Sep 11, 2024 | 1:37 PM Updated Updated Sep 11, 2024 | 1:37 PM

Mind Blowing Twist In Devara Movie: దేవర నుంచి రివీల్ అవుతున్న ఒక్కో విషయం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో విషయం వైరల్ గా మారింది. దేవరలో ఉన్న ఆ ఒక్క ట్విస్ట్ కి ప్రేక్షకులు పిచ్చెక్కిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Mind Blowing Twist In Devara Movie: దేవర నుంచి రివీల్ అవుతున్న ఒక్కో విషయం ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో విషయం వైరల్ గా మారింది. దేవరలో ఉన్న ఆ ఒక్క ట్విస్ట్ కి ప్రేక్షకులు పిచ్చెక్కిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 11, 2024 | 1:37 PMUpdated Sep 11, 2024 | 1:37 PM
Devara: దేవర.. ఆ ఒక్క ట్విస్ట్ కు దిమ్మ తిరిగి పోవాల్సిందే!

ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చో బెట్టడం అంటే ఆశామాషీ విషయం కాదు. స్టార్ హీరో, కథ అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఆడియెన్స్ ను సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే ఎలిమెంట్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి. దానికి డైరెక్టర్లు, రైటర్లు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇక మూవీలో ట్విస్ట్ లు లేకుంటే సినిమా చప్పగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. అందుకే డైరెక్టర్లు ఆడియెన్స్ ఊహించని ట్విస్ట్ లను మూవీలో పెడుతుంటారు. అలాంటి ఓ ఊహించని ట్విస్ట్ ‘దేవర’ మూవీలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్. పోకిరి రేంజ్ లో ఈ ట్విస్ట్ ఉండబోతున్నట్లు సమాచారం.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’ గురించి ఇప్పటి వరకు తెలిసింది ఒకలెక్క.. ఇప్పుడు చెప్పుకోబోయే మ్యాటర్ ఇంకో లెక్క. ట్రైలర్ విడుదల అయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. దేవరలో మన ఊహకందని ఊచకోత ఉందని అర్దం అవుతోంది. ఇక ఈ చిత్రంలో తారక్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ చూపించాడు. తండ్రి పాత్రను రా అండ్ రస్టిక్ గా, కొడుకు పాత్రను పిరికివాడిగా, భయస్తుడిగా చూపించాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆ ట్విస్ట్ కు థియేటర్లలో ప్రేక్షకులకు దిమ్మతిరిగిపోవడం ఖాయమట. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా? తండ్రి దేవర పేరుతో భయస్తుడిగా నటిస్తూ.. కొడుకే ఊచకోత కోస్తుంటాడట. సినిమాలో రివీల్ అయ్యే ఈ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్ అవుతుందట. ప్రస్తుతం ఈ న్యూస్ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా.. కొడుకే దేవర అయితే.. ఇంతకీ దేవర ఉన్నాడా? లేడా? అనే కొత్త సందేహం అభిమానుల్లో రేకెత్తుతోంది. ఇందులో తారక్ డ్యూయెల్ రోల్ చేయడం లేదా? అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మేకర్స్ కావాలనే ఈ సస్పెన్స్ ను క్రియేట్ చేశారా? అంటున్నారు అభిమానులు. ఇది అధికారికంగా తెలిసిన న్యూస్ కాకపోయినప్పటికీ.. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తారక్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఇలాంటి బ్లాస్టింగ్ ట్విస్ట్ లు ఉంటే.. ఫ్యాన్స్ తో పాటుగా అభిమానులకు కూడా ఫుల్ కిక్కెక్కుతుంది. దేవరలో ఈ ట్విస్ట్ ఉంటే.. టాలీవుడ్ లో పోకిరి తర్వాత మళ్లీ అలాంటి ట్విస్ట్ ఇదే అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దేవర పేరుతో కొడుకే విధ్వంసం సృష్టిస్తున్నాడా? అన్నది తెలియాలంటే.. సెప్టెంబర్ 27 దాక ఆగాల్సిందే. మరి నిజంగానే ఇలాంటి ట్విస్ట్ మూవీలో ఉంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom