iDreamPost
android-app
ios-app

Devara: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్? ఎప్పుడంటే?

  • Published Sep 12, 2024 | 3:07 PM Updated Updated Sep 12, 2024 | 3:07 PM

Jr NTR, Devara pre release event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ వేడుక ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Jr NTR, Devara pre release event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ వేడుక ఎప్పుడు నిర్వహించబోతున్నారు? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 12, 2024 | 3:07 PMUpdated Sep 12, 2024 | 3:07 PM
Devara: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్? ఎప్పుడంటే?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకెళ్తోంది. దేవరలో తారక్ ఊచకోత ఏ రేంజ్ లో ఉందో ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతోంది. ఇక మేకర్స్ ప్రమోషన్స్ లో సైతం స్పీడ్ పెంచేశారు. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం.

దేవర మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఇప్పటికే తారక్ ముంబైలో వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సాలిడ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారు? ముఖ్య అతిథిగా ఎవరొస్తారు? అంటూ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈవెంట్ కు సంబంధించిన డేట్ ఫిక్స్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దేవర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 21 లేదా 22వ తారీఖున గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ న్యూస్ తో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య  అతిథిగా ఎవరొస్తారు? అన్నది ప్రస్తుతం అందరిలో ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ కు మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా బన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని టాక్ నడుస్తోంది. వీరిద్దరు ఒకరిని ఒకరు బావా.. బావా అని పిలుచుకోవడం మనకు తెలియనిది కాదు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ వేడుకుగా గెస్ట్ గా వస్తాడని మరో వార్త వైరల్ గా మారింది. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రం కన్ఫామ్ గా వస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దేవర నుంచి రెండో ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చుట్టమల్లే సాంగ్, దావూదీ పాటలకు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మరి దేవర ప్రీ రిలీజ్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు? గెస్ట్ గా ఏ హీరో వస్తాడని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş