Devara Movie Review And Rating In Telugu: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర మూవీని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఎన్టీఆర్ దేవర మూవీ ప్రేక్షకులకు ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
Devara Movie Review And Rating In Telugu: యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర మూవీని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మరి ఎన్టీఆర్ దేవర మూవీ ప్రేక్షకులకు ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
Keerthi
జూనియర్ యన్టీఆర్, కొరటాల శివ కాంబోలోదేవర సినిమా రివ్యూ.. తారక్ ఊచకోతకు థియేటర్లు షేక్ అయ్యాయా? తెరకెక్కిన దేవరపై ఏ స్థాయి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. రిలీజ్ కి ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. దేవర అభిమానుల అంచనాలను అందుకునే స్థాయిలో ఉందా? తారక్ చెప్పినట్టు ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
ఏపీ తమిళ నాడు బోర్డర్లో రత్నగిరి అనే ప్రాంతం. అక్కడ దేవర ( యన్టీఆర్) రాయప్ప(శ్రీకాంత్), భైరా (సైఫ్ అలీఖాన్), కుంజ (కళయరసన్), కోర (షేన్ చామ్ టాకో) వారంతా సముద్రంలో వచ్చే సరుకుని దొంగతనాలు చేస్తూ ఉంటారు. కానీ.., తాము బయటకి తీసుకొస్తున్న సరుకు కారణంగా బయట చాలా దారుణాలు జరుగుతున్నాయని తెలుసుకున్న దేవర.. ఇకపై సముద్రంలో దొంగతనం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. దీనిని భైరాతో పాటు మరికొందరు వ్యతిరేకిస్తారు. దీంతో.. దేవర తన వారిపైనే యుద్దానికి దిగుతాడు. దెబ్బకు వాళ్ళు మళ్లీ తప్పుడు పని కోసం సముద్రం ఎక్కాలి అంటేనే భయపడతారు. కానీ.., భైరా మాత్రం దేవరని చంపి.. చెడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశ పడతాడు. దీంతో.. దేవర ఓ కీలక నిర్ణయం తీసుకొని.. సముద్రంలోకి దొంగతనం కోసం ఎవరు వచ్చినా తెగ నరుకుతూ ఉంటాడు. అలా ఏళ్ళు గడిచిపోగా.. దేవర కొడుకు వరా (ఎన్టీఆర్) భయస్తుడిగా మారతాడు? అతడు దైర్యవంతుడిగా మారితే.. పెళ్లి చేసుకునేందుకు తంగం(జాన్వీ కపూర్) ఎదురుచూస్తూ ఉంటుంది. మరి.. దేవర కొడుకు భయస్తుడిగా ఎలా మారాడు? అసలు దేవర ఏమయ్యాడు? ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానమే దేవర మూవీ.
కథని ఒక ఊహాజనిత ప్రాంతాన్ని నేపథ్యం చేసుకుని చెప్పాలంటే.. ముందుగా ఆ వరల్డ్ ని బాగా బిల్డ్ చేసుకోవాలి. ఆడియన్ ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోవాలి. ఆ తరువాత అక్కడ ఎలాంటి ఎమోషన్ అయినా పండుతుంది. బాహుబలి, సలార్ వంటి సినిమాలు ఇందకు మంచి ఉదాహరణ. కానీ.., దేవరలో కొరటాల శివ ఇలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. రత్నగిరి, అక్కడ నాలుగు కొండలు.. అందులో భయం తెలియని మనుషులు, వారిలో భయం పుట్టించే దేవర అంటూ.. మాటలతో మాయ చేసేయాలని చూశాడు. ఇది బెడిసికొట్టింది. దీంతో మొదటి 15 నిమిషాల సినిమా చాలా భారంగా మారిపోయింది. కాకపోతే.. సినిమాలో ఉండే కొన్ని స్పెషల్ సీక్వెన్స్ లు బాగా పేలడం దేవరకి పెద్ద బలం అయింది.
ఫస్ట్ ఆఫ్ స్టోరీ నేరేషన్ లో కొరటాల బాగా సక్సెస్ అయ్యాడు. దేవర ఎవరు? దేవర నేపథ్యం ఏంటి? అతను ఎందుకు మారాడు? వంటి విషయాలను చాలా ఆసక్తికరంగా చూపించాడు. ఇక దేవర క్యారెక్టర్ లో మార్పు రావడం దగ్గర నుండి కథలో వేగం పెరిగింది. ఇక్కడ కొన్ని బలమైన సన్నివేశాలకి.. తారక్ టాప్ రేంజ్ యాక్టింగ్ తోడు కావడంతో ఎమోషన్ బాగా క్యారీ అయింది. ఇక ఇక్కడ నుండి ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోవడం, వీటికి తోడు యాక్షన్ సీన్స్ బాగా కుదరడంతో దేవర ఫస్ట్ ఆఫ్ బాగా వచ్చింది అనే ఫీల్ కలుగుతుంది.
ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత దేవరలో కామెడీ యాంగిల్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా వర పాత్రలో తారక్ యాక్టింగ్ అదిరిపోయింది. కానీ.. ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రీ క్లైమ్యాక్స్ లో యాక్షన్ బ్లాక్ బాగా కుదిరినా.. క్లైమ్యాక్స్ మాత్రం అంతగా ఆకట్టుకోకపోవడం సినిమాకి మైనస్ గా మారిపోయింది. ఈ క్లైమ్యాక్స్ బాహుబలి1 పోలి ఉండటంతో దేవర స్థాయి తగ్గిపోయింది. కాకపోతే తారక్ యాక్టింగ్ తో పాటు, జాన్వీ గ్లామర్, యాక్షన్ సీక్వెన్స్ లు సెకండ్ ఆఫ్ లో సినిమాని కాపాడాయి.
నటీనటుల పనితీరు, టెక్నికల్ విభాగం:
దేవర సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ నటన. దేవర, వరా అనే రెండు పాత్రలలో కూడా ఒదిగిపోయాడు. ఇక ఆ 2 పాత్రల్లోనూ తనదైన శైలిలో వేరియేషన్స్ చూపించాడు. ఇక జాన్వి కపూర్ అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు. ఉన్నంతలో ఆమె పరవాలేదు అనిపించింది. ఇక సైఫ్ అలీ ఖాన్ మాత్రం తారక్ తో పోటీగా నటించాడు. ప్రకాష్ రాజ్, కళయరసన్, షేన్ చాం టాకో, శ్రీకాంత్, శృతి మరాఠీ, మురళీ శర్మ, అభిమన్యు సింగ్ వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీంలో ముందగా మాట్లాడుకోవాల్సింది అనిరుధ్ గురించే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరకొట్టేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగా వచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా కూడా కొరటాల ఓకే అనిపించుకున్నాడు. కాకపోతే కథపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.
రేటింగ్: 2.5
చివరి మాట:
దేవర.. అంచనాలు పెట్టుకోకుండా చూస్తే నచ్చే సినిమా