iDreamPost
android-app
ios-app

దేవర సూపర్ హిట్.. మరి ఇప్పుడు కొరటాల పరిస్థితేంటి ?

  • Published Oct 05, 2024 | 1:36 PM Updated Updated Oct 05, 2024 | 1:36 PM

Koratala Siva : ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ ఈ రేంజ్ హిట్ ఇస్తాడని అయితే ఎవరు ఊహించ లేరు. సరే దేవర అయిపొయింది మరి తర్వాత ఏంటి.. ఎన్టీఆర్ ఎలాగూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. మరి కొరటాల పరిస్థితి ఏంటి

Koratala Siva : ఆచార్య లాంటి ప్లాప్ తర్వాత కొరటాల శివ ఈ రేంజ్ హిట్ ఇస్తాడని అయితే ఎవరు ఊహించ లేరు. సరే దేవర అయిపొయింది మరి తర్వాత ఏంటి.. ఎన్టీఆర్ ఎలాగూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యాడు. మరి కొరటాల పరిస్థితి ఏంటి

  • Published Oct 05, 2024 | 1:36 PMUpdated Oct 05, 2024 | 1:36 PM
దేవర సూపర్ హిట్..  మరి ఇప్పుడు కొరటాల పరిస్థితేంటి ?

దేవరతో కొరటాల కొట్టడయ్యా.. అసలు ఈ రేంజ్ కథను ఊహించలేదు.. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఇలాంటి హిట్ ఇవ్వడం చిన్న విషయం కాదు. నువ్వు కేక.. అంటూ తారక్ అభిమానులు కొరటాల శివను తెగ పొగిడేస్తున్నారు. నిజమే ఫ్యాన్స్ చెప్పేదానిలో వాస్తవం లేకపోలేదు. డైరెక్టర్స్ ఏదైనా ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారంటే.. ప్రేక్షకులు ఆ దర్శకులపై ప్రశంసలు కురిపిస్తారు. కానీ అదే డైరెక్టర్ నుంచి ఒక్క ప్లాప్ వచ్చినా.. వారిపై నమ్మకాన్ని వదిలేసుకుంటారు . నెక్స్ట్ మూవీస్ పై కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. వారు తీసేది ఎంత పెద్ద స్టార్స్ తో అయినా సరే.. ప్రేక్షకులలో ఎక్కడో ఓ దగ్గర కాస్త సందేహాలు ఉంటాయి. కానీ అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. ఈ లెక్కల వెనుక తారక్ అనే లక్ ఫ్యాక్టర్ ఉంది. దర్శకుల ప్లాప్స్ కు హిట్స్ అందించడానికి తారక్ ఉన్నాడు. ఇది దేవరతో ప్రూవ్ అయింది. సరే దేవర బ్లాక్ బస్టర్ హిట్. తారక్ కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. మరి కొరటాల పరిస్థితి ఏంటి..

కొరటాల దేవరతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. దీనితో ప్రేక్షకులలో ఈ దర్శకుడి కథపైన , మేకింగ్ పైన నమ్మకం ఏర్పడింది. దానికి దర్శకుడు చాలా హ్యాపీ. కానీ కొరటాలకు అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఎందుకంటే ఈ రేంజ్ హిట్ ఇచ్చాక.. కచ్చితంగా నెక్స్ట్ మూవీస్ మీద మరిన్ని అంచనాలు ఉంటాయి. సో తనేంటో ప్రూవ్ చేయాలంటే అది దేవరకు మించిన కథ అయ్యుండాలి. అలాంటి కథ తీయాలంటే కచ్చితంగా దానికోసం టైర్-1 హీరోలనే ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ , తారక్ , చరణ్ , అల్లు అర్జున్ , మహేష్ బాబు వీరంతా మోస్ట్ వాంటెడ్ హీరోస్. వీరంతా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజి బిజీగా ఉన్నారు. ప్రభాస్ స్పీడ్ కు ఏకంగా దర్శకులే నోటి మీద వేలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ లో ఉన్నాడు ప్రభాస్.. ఆ తర్వాత సలార్-2, కల్కి-2 , ఫౌజీ సినిమాలతో గ్యాప్ లేకుండా షెడ్యూల్ ఉంది. ఇక తారక్ కూడా అంతే.. ప్రస్తుతం తారక్ వార్-2 షూటింగ్ లో ఉన్నాడు. తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. ఇక ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ , వెట్రిమారన్ తో కూడా సినిమాలు తీసే ప్లాన్ లో ఉన్నాడట తారక్.

రామ్ చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం  చరణ్ నుంచి గేమ్ చెంజర్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. దాని తర్వాత బుచ్చిబాబు తో ఓ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అటు అల్లు అర్జున్ కూడా పుష్ప-2 సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ నెలల సమయం మాత్రమే ఉండడంతో.. పనులన్నీ వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు విషయం మూడేళ్ళ వరకు మర్చిపోవాల్సిందే. జక్కన్న డీల్ గురించి తెలిసిన విషయమే కదా. సో ఇలా హీరోలంతా వచ్చే మూడు నాలుగేళ్ల వరకు గ్యాప్ లేకుండా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని ఉన్నారు. ఈ లెక్కన చూస్తే కొరటాల దగ్గర కథ ఉన్నా.. డేట్స్ ఇవ్వడానికి హీరో మాత్రం లేడు. ఏదేమైనా ఈసారి కొరటాల నుంచి వచ్చే కథ మీద మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ గ్యాప్ లో కొరటాల దేవర-2 కోసం ఇంకాస్త బలంగా కంటెంట్ ను ప్రిపేర్ చేస్తాడో.. లేదా కొత్త కథలతో వేరే హీరోల దగ్గరకు వెళ్తాడో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom