iDreamPost
android-app
ios-app

Devara: తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. APలో ముందే దేవర షోస్!

  • Published Sep 21, 2024 | 1:02 PM Updated Updated Sep 21, 2024 | 1:02 PM

Devara movie special shows in AP: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఏపీలో ముందుగానే దేవర షోస్ పడనున్నాయి.

Devara movie special shows in AP: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఏపీలో ముందుగానే దేవర షోస్ పడనున్నాయి.

  • Published Sep 21, 2024 | 1:02 PMUpdated Sep 21, 2024 | 1:02 PM
Devara: తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. APలో ముందే దేవర షోస్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘దేవర’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక విడుదలకు ముందే తారక్ తన స్టామినాను చూపిస్తూ.. పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. ప్రమోషన్ల విషయంలో మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా రాకెట్ స్పీడ్ తో ప్రమోషన్స్ చేపడుతున్నారు తారక్ అండ్ టీమ్. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంతో ఏపీలో ముందే దేవర స్పెషల్ షోస్ పడనున్నాయి.

దేవర స్పెషల్ షోస్ కు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయా? ఇవ్వవా? అన్న టెన్షన్ నిన్న, మెున్నటి వరకు ఫ్యాన్స్ లో ఉంది. కానీ.. ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ప్రత్యేక షోలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ షోలకు అనుమతులు ఇవ్వాలని మేకర్స్ కోరడంతో.. ప్రభుత్వం అందుకు అంగీకరించింది. దాంతో అర్థరాత్రి 12 గంటల నుంచే స్పెషల్ షోలు పడనున్నాయి. అలాగే విడుదల రోజు అంటే 27వ తారీఖు 6 షోలకు అనుమతి కూడా ఇచ్చింది. అలాగే రిలీజ్ తర్వాత 9 రోజుల పాటు 5 షోలు నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక దేవర మూవీ టికెట్ల రేట్లు పెంచాలని మేకర్స్ కొరగా.. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం టికెట్ రేట్లను కూడా  పెంచింది. సింగిల్ స్క్రీన్స్ లో అప్పర్ క్లాస్ లో రూ. 110 వరకు, లోయర్ క్లాస్ లో రూ. 60, ఇక మల్టీప్లెక్స్  ల్లో రూ. 135 వరకు రేట్లను పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. కాగా.. స్పెషల్ షోస్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కల నెరవేరింది. అర్థరాత్రి 12 గంటల నుంచే తారక్ మూవీని చూసి ఎంజాయ్ చేయెుచ్చు. ఇదిలా ఉండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ ట్రైలర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ కు ఇది డబుల్ ట్రీట్ గా చెప్పొచ్చు. ప్రమోషన్స్ ను పీక్స్ లో ఉండటంతో.. దేశ వ్యాప్తంగా దేవర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి యంగ్ టైగర్ ఏ రేంజ్ లో రికార్డులు కొల్లగొడతాడో?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş