iDreamPost
android-app
ios-app

Devara: ఆ విషయంలో దేవర భయపడ్డాడా? లేక స్ట్రాటజీనా? పూర్తి వివరాలు..

  • Published Sep 20, 2024 | 1:00 PM Updated Updated Sep 20, 2024 | 1:00 PM

Devara Movie Pre Release Business Strategy: దేవర మూవీ రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నకొద్ది.. ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర భయపడ్డాడా? లేక అది స్ట్రాటజీనా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Devara Movie Pre Release Business Strategy: దేవర మూవీ రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్నకొద్ది.. ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర భయపడ్డాడా? లేక అది స్ట్రాటజీనా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Devara: ఆ విషయంలో దేవర భయపడ్డాడా? లేక స్ట్రాటజీనా? పూర్తి వివరాలు..

‘దేవర’.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ప్రెస్టేజియస్ మూవీ. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. తారక్ తో సహా టీమ్ అంతా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవర ఆ విషయంలో భయపడ్డాడా? లేక అది మేకర్స్ స్ట్రాటజీనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ విషయం ఏంటి? నిజంగానే ఇది మేకర్స్ స్ట్రాటజీనా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తారక్ అండ్ టీమ్ దేవర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పబ్లిసిటీ కల్పించడంలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు మూవీ టీమ్. దాంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవర గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైగా ఇది ఇటు తారక్ ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ లో కూడా ఓ సందేహాన్ని రేకెత్తిస్తోంది. దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మేకర్స్ భయపడ్డారా? లేక ఇది వారి స్ట్రాటజీలో భాగమేనా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దేవరకు వరల్డ్ వైడ్ గా రూ. 180 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. నైజాంలో రూ. 45 కోట్లతో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 113 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

ఇక మిగతా రాష్ట్రాలు అయిన కర్ణాటకలో రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, హిందీ బెల్ట్ లో రూ.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ.26 కోట్లు ఇలా వరల్డ్ వైడ్ గా కలిపి రూ. 180 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. దాంతో దేవర బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది భారీ టార్గెట్ అయినప్పటికీ.. దేవరపై ఉన్న అంచనాల దృష్ట్యా పెద్ద విషయం కాదు. అయితే తారక్ స్టామినా, దేవరపై ఉన్న అంచనాలను పరిగణంలోకి తీసుకుంటే.. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువనే చెప్పాలి. రూ. 180 కోట్లు దేవరకి చాలా తక్కువ. చాలా ఏరియాల్లో తారక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కేరళలో ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. కానీ.. రూ. 50 లక్షలే అక్కడ జరిగింది. అయితే ఇలా తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం వెనక మేకర్స్ స్ట్రాటజీ ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది.

దేవర టీమ్ చాలా పకడ్భందీగా అడుగులు వేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తోంది. అవును పార్ట్ 2ను దృష్టిలో పెట్టుకునే దేవర పార్ట్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్ ను రూ. 180 కోట్లకు ముగించినట్లు తెలుస్తోంది. భారీ మెుత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. ఒకవేళ బ్రేక్ ఈవెన్ సాధించకపోతే.. దాని ప్రభావం పార్ట్ 2పై పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలనే మేకర్స్ స్ట్రాటజీని ఉపయోగించి.. తక్కువ రేట్లకే మూవీని అమ్మేశారు. అసలు దేవరకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడే భారీ రేంజ్ కు వెళ్లి.. తర్వాత ఇబ్బందులు పడేకంటే.. ఇప్పుడే కాస్త తగ్గి.. ఆ తర్వాత పుంజుకోవడం బెటర్ అని మేకర్స్ భావిస్తున్నట్లు ఉంది. అందుకే ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.