iDreamPost
android-app
ios-app

Devara: దేవర వేట మెుదలు.. వణుకుతున్న బాక్సాఫీస్ రికార్డులు!

  • Published Sep 11, 2024 | 9:00 AM Updated Updated Sep 11, 2024 | 9:00 AM

Devara Huge Records: విడుదలకు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ రికార్డులు సృష్టిస్తోంది. దాంతో తారక్ దెబ్బకు రికార్డులు వణుకుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Devara Huge Records: విడుదలకు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ రికార్డులు సృష్టిస్తోంది. దాంతో తారక్ దెబ్బకు రికార్డులు వణుకుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 11, 2024 | 9:00 AMUpdated Sep 11, 2024 | 9:00 AM
Devara: దేవర వేట మెుదలు.. వణుకుతున్న బాక్సాఫీస్ రికార్డులు!

దేవర.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటంతో.. మేకర్స్ ప్రమోషన్స్ ను ట్రైలర్ లాంచ్ తో గ్రాండ్ గా ప్రారంభించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ ను కట్టిపడేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపాడు. యాక్షన్ సీక్వెన్స్ లో తారక్ ను చూస్తే.. గుస్ బంప్స్ రావడం పక్కా. ఇక విడుదలకు ముందే దేవర వేట మెుదలైంది. దాంతో ఒక పక్క బాక్సాఫీస్ రికార్డులు వణుకుతున్నాయి.

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తారక్ డైలాగ్స్, యాక్షన్ కు సోషల్ మీడియా షేక్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే దేవర ట్రైలర్ 25 మిలియన్లకు పైగా వ్యూస్ తో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దాంతో దేవర వేట మెుదలైంది అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే.. విడుదలకు ముందే తారక్ సరికొత్త రికార్డులను బద్దలు కొడుతున్నాడు. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో ట్రైలర్ రిలీజ్ కాకముందే 1 మిలియన్ డాలర్ల మార్క్ ను చేరుకున్న తొలి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది.

Devara

ఈ క్రమంలో గతంలో కొరటాల శివ దర్శకత్వంలోనే వచ్చిన చిరంజీవి, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ అయిన ‘ఆచార్య’ రికార్డును కూడా బ్రేక్ చేశాడు తారక్. దేవర దెబ్బకు ఆచార్య ఔట్ అయ్యింది. మూవీ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉండటంతో.. నార్త్ అమెరికాలో 3 వేల డాలర్ల మార్క్ ను తారక్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే ఇండియన్ సినిమా చరిత్రలో దేవర ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసినట్లే. కాగా.. ఇప్పటికే ఈ ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు కూడా చాట్ బస్టర్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ ను అల్లాడించింది. దావూదీ సాంగ్ కూడా ఆడియెన్స్ ను అలరిస్తూ.. సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది. ఇక ఇప్పుడు దేవర ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. దాంతో ఊపిరిసలపకుండా ఒకదాని తర్వాత ఒకటి దేవర నుంచి వస్తున్న కంటెంట్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ క్రమంలోనే దేవర దెబ్బకు రికార్డులు వణుకుతున్నాయి. మరి రిలీజ్ కు ఇంకాస్త సమయం ఉండటంతో.. తారక్ ఇంకెన్ని ఘనతలు సాధిస్తాడో వేచి చూడాలి. దేవర సృష్టిస్తున్న ఈ రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet