Somesekhar
Koratala Siva revealed Devara movie story: దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో కొరటాల శివ అసలు కథ ఏంటో రివీల్ చేశాడు. దాంతో ఊచకోతకు కొదవలేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Koratala Siva revealed Devara movie story: దేవర మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో కొరటాల శివ అసలు కథ ఏంటో రివీల్ చేశాడు. దాంతో ఊచకోతకు కొదవలేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Somesekhar
దేవర ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఈ మూవీ స్టోరీకి సంబంధించి ఓ అంచనాకు వచ్చారు. ఇంతకు ముందు దేవర కథ ఏంటి అన్న సంగతి చాలా మందికి తెలీదు. ట్రైబల్స్ నేపథ్యంలో సముద్రంపై జరిగే యాక్షన్ డ్రామాగా మూవీ అనౌన్స్ మెంట్ అప్పుడు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత కథకు సంబంధించి ఎలాంటి హింట్ కూడా డైరెక్టర్ కొరటాల శివ ఇవ్వలేదు. కానీ.. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్ది ఈ మూవీ గురించి ఒక్కో వార్త బయటకి వస్తుంటే.. ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. కాగా.. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో కొరటాల శివ అసలు కథ ఏంటో రివీల్ చేశాడు. దాంతో మనం ఊహించిన దానికంటే స్టోరీ ఎక్కువగానే ఉందన్న అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది స్టోరీ, స్టోరీలో ఉన్న విషయాలు ఒక్కోటి రివీల్ చేస్తూ వస్తే.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగి.. మూవీపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ బజ్ కాస్త.. భారీ ఓపెనింగ్స్ కు కారణం అవుతుంది. ప్రస్తుతం దేవర టీమ్ చేస్తున్న పని ఇదే. ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ పై గట్టి ఫోకస్ పెట్టిన తారక్ అండ్ టీమ్.. అక్కడ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో దేవర స్టోరీని రివీల్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు అసలు స్టోరీ ఏంటి అన్న సంగతి రివీల్ చేయలేదు. ట్రైలర్ లో కథపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇంటర్వ్యూలో కథను రివీల్ చేశారు.
ఇక దేవర మూవీ స్టోరీ విషయానికి వస్తే.. 1980-90ల నేపథ్యంలో సాగుతుందని, ఓ నాలుగు గ్రామాలు వాళ్ల పూర్వీకుల ఆయుధాలను పూజిస్తూ ఉంటారట. ఇక ఈ గ్రామాల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుందట. అంతే కాదండోయ్ ఈ స్టోరీ మెుత్తం ఒకే కుటుంబానికి చెందినదని కొరటాల చెప్పుకొచ్చాడు. దాంతో తారక్-సైఫ్ లది ఒకే ఫ్యామిలీ అన్న రహస్యం కూడా బట్టబయలైంది. అదీకాక సినిమాలో దేవర క్యారెక్టర్ కు ప్రజలందరూ భయపడతారని తెలిపాడు. అలాగే మూవీ రన్ టైమ్ కూడా దాదాపు 3 గంటలు ఉంటుందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. కొరటాల రివీల్ చేసిన ఈ సీక్రెట్స్ కాస్త వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ తమ బుర్రలకు పదునుపెట్టారు.
పూర్వీకుల ఆయుధాలను పూజిస్తున్నారంటే.. సినిమాలో ఊచకోతకు కొదవుండదన్న నిర్ణయానికి వాళ్లు వచ్చేశారు. నాలుగు గ్రామాల మధ్య తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయని ఊహించుకుంటున్నారు. అలాగే సైఫ్ అలీఖాన్-తారక్ ఒకే కుటుంబం అని చెప్పడంతో.. తండ్రి వారసత్వం కోసం ఇద్దరు శత్రువుగా మారి కొట్టుకుంటారని కథను అల్లేస్తున్నారు. మనం ఊహించినదానికంటే సినిమాలో ఊచకోత కాస్తంత ఎక్కువే ఉండేలా ఉందని ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. స్టోరీని డైరెక్టర్ కొరటాల శివ కాస్త రివీల్ చేయడంతో.. దేవరపై అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.