Somesekhar
huge expectations reduced on Devara: దేవర మూవీపై భారీ అంచనాలను తగ్గిస్తేనే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. పైగా అది సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని పేర్కొంటున్నారు.
huge expectations reduced on Devara: దేవర మూవీపై భారీ అంచనాలను తగ్గిస్తేనే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు. పైగా అది సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని పేర్కొంటున్నారు.
Somesekhar
స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే దానిపై మామూలుగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ఆ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ గా ఉంటే.. ఆ అంచనాలు కాస్త పీక్స్ కు చేరుకుంటాయి. ప్రస్తుతం దేవర విషయంలో అదే జరుగుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో పాటుగా ఇంతకు ముందు రిలీజ్ అయిన సాంగ్స్ సినిమాపై ఎక్కడా లేని హైప్ ను క్రియేట్ చేశాయి. పైగా చివరి 40 నిమిషాలు థియేటర్లు తగలబడిపోతాయి అంటూ స్వయంగా తారక్ స్టేట్ మెంట్ ఇవ్వండంతో.. ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఈ అంచనాలు తగ్గితేనే మంచిదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గతంలో ఈ సినిమాకు కూడా ఇంత హైప్ క్రియేట్ కాలేదు. సూపర్ బజ్ తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అదీకాక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ లో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి. ఎన్టీఆర్ ఊచకోతను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవరపై నెలకొన్న భారీ అంచనాలు తగ్గితేనే మంచిదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇలా తగ్గడం మూవీకి కూడా అనుకూలంగా మారుతుందన్నది వారి వాదన. ఒక విధంగా వీరి వాదనలో నిజం లేకపోలేదు.
సాధారణంగా ఓ ప్రేక్షకుడు భారీ అంచనాలు పెట్టుకుని థియేటర్ కు వెళ్తే.. అక్కడ ఎంత మంచి సినిమా అయినా అతడికి సోసోగానే అనిపిస్తుంది. ఇక అంచనాలు పెట్టుకుని వెళ్లిన సినిమాకు డివైడ్ టాక్ వచ్చిందంటే ఆ మూవీ పోయినట్లే. ఇక ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కు వెళ్తే యావరేజ్ కంటెంట్ ఉన్న మూవీలను కూడా సూపర్ అంటారు ప్రేక్షకులు. పైకి కనిపించనప్పటికీ.. ఈ క్యాలిక్యూలేషన్స్ ఇండస్ట్రీలో మస్ట్ అండ్ షుడ్ గా ఉంటాయి. ప్రస్తుతం దేవరకు కూడా ఇలాంటి లెక్కలే వర్తిస్తాయి. సినిమాకు భారీ హైప్ ను తీసుకురావడం మంచిదే.. కానీ.. మరీ ఎక్కువ తీసుకొస్తే మాత్రం తర్వాత ఇబ్బందులు ఎదురౌతాయి అన్నది సినీ పండితుల మాట. మూవీకి క్రేజ్ తీసుకొచ్చి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలన్నది మేకర్స్ భావన. కానీ ఇక్కడ లాంగ్ రన్ కోసం కూడా ఆలోచించాలి అంటున్నారు. బజ్ లేకుండా వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అందుకే దేవర విషయంలో కూడా అంచనాలు కాస్త తగ్గిస్తే బెటర్ అని, అది సినిమాకు కలిసొస్తుందని సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు. మరి నిజంగానే అంచనాలు తగ్గిస్తే మంచిదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.