iDreamPost
android-app
ios-app

Jr NTR: దేవర కోసం యంగ్ టైగర్ అన్ని కోట్లు తీసుకున్నాడా?

  • Published Sep 15, 2024 | 5:46 PM Updated Updated Sep 15, 2024 | 5:46 PM

Jr NTR Remuneration For Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ మూవీ కంటే ఎక్కువే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Jr NTR Remuneration For Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ మూవీ కంటే ఎక్కువే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Published Sep 15, 2024 | 5:46 PMUpdated Sep 15, 2024 | 5:46 PM
Jr NTR: దేవర కోసం యంగ్ టైగర్ అన్ని కోట్లు తీసుకున్నాడా?

దేవర.. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ. ఇక ఈ చిత్రం రోజుకో రికార్డు బద్దలు కొడుతూ.. ఎవ్వరూ ఊహించని అంచనాలను క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ఇంకాస్త హైప్ పెరిగిందనే చెప్పాలి. ట్రైలర్ లోనే తారక్ యాక్షన్ ఈ రేంజ్ లో చూపించాడంటే.. ఇక సినిమాలో ఊచకోత తప్పది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ మూవీ కంటే ఎక్కువే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో దేవర కోసం యంగ్ టైగర్ అన్ని కోట్లు తీసుకున్నాడా? అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

దేవర.. దేశవ్యాప్తంగా ఈ మూవీ గురించి చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దేవరకు సంబంధించి రోజుకో న్యూస్ పరిశ్రమను షేక్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి గాను యంగ్ టైగర్ అందుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది. దేవర మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా రూ. 60 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. కాగా.. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీకి తారక్ రూ. 45 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వైరల్ గా మారాయి. అంటే ఈ లెక్కన చూసుకుంటే.. ఎన్టీఆర్ పారితోషికం 33 శాతం పెరిగినట్లు అన్న మాట. ఇక ఈ విషయంలో నిజమెంతో తెలియనప్పటికీ.. ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్ గా మారింది.

కాగా.. మిగతా వారి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ రూ. 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ రూ. 10 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ. 1.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. మిగతా ఆర్టిస్టులు సైతం భారీగానే పారితోషికాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తారక్ అండ్ టీమ్ బాలీవుడ్ లో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. అక్కడి మార్కెట్ పై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇక దేవర ప్రమోషన్స్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన యంగ్ టైగర్.. దేవరతో ఈ ఏ రేంజ్ కలెక్షన్లు రాబడతాడో. మరి తారక్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş