iDreamPost
android-app
ios-app

Devara: ఆ 5 నిమిషాలు విధ్వంసమే! థియేటర్లలో దేవర సునామీ ఖాయం!

  • Published Sep 25, 2024 | 9:01 AM Updated Updated Sep 25, 2024 | 9:01 AM

Devara Movie last 5 minutes Climax theatres shake: దేవర మూవీ క్లైమాక్స్ లో వచ్చే చివరి 5 నిమిషాలు థియేటర్లలో సునామీ రావడం ఖాయంగా చెప్పుకొచ్చాడు తారక్. ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తోంది.

Devara Movie last 5 minutes Climax theatres shake: దేవర మూవీ క్లైమాక్స్ లో వచ్చే చివరి 5 నిమిషాలు థియేటర్లలో సునామీ రావడం ఖాయంగా చెప్పుకొచ్చాడు తారక్. ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తోంది.

  • Published Sep 25, 2024 | 9:01 AMUpdated Sep 25, 2024 | 9:01 AM
Devara: ఆ 5 నిమిషాలు విధ్వంసమే! థియేటర్లలో దేవర సునామీ ఖాయం!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ కోసం ఇండియా మెుత్తం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. దేవర గురించి తెలుస్తున్న రోజుకో కొత్త విషయంతో సినిమాపై భారీ అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అదీకాక ట్రైలర్ లో తారక్ ఊచకోత చూసిన అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్లలో యంగ్ టైగర్ సునామీని చూడాలా అని ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా తారక్ రివీల్ చేస్తూ వస్తున్న విషయాలు సినిమాపై హైప్ ను అమాంతం పెంచేస్తున్నాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే చివరి 5 నిమిషాలు థియేటర్లలో సునామీ రావడం ఖాయంగా చెప్పుకొచ్చాడు తారక్. ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తోంది.

సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో దేవర సునామీ రాబోతోంది. ఇందుకోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ తో పాటుగా సగటు సినీ అభిమానులు కూడా క్యూరియాసిటీతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా తారక్ కరణ్ జోహార్, ఆలియా భట్ లతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇందులో సినిమాకు సంబంధించి వెల్లడించిన విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటుగా సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా.. ఫ్యాన్స్ కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. దేవరలో చివరి 30-40 నిమిషాలు మీరు ఊహించలేరని ముందు నుంచే తారక్ చెప్పుకొస్తున్నాడు. అయితే ఇప్పుడు క్లైమాక్స్ లో వచ్చే చివరి 5 నిమిషాలకు థియేటర్లలో సునామీతో విధ్వంసం వస్తుందని ఎన్టీఆర్ తెలిపాడు. ఈ మాటలే ఫ్యాన్స్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ అభిమాన హీరో ఊచకోతను ఎప్పుడెప్పుడు చూడాలా? అని లక్ష కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. దేవర క్లైమాక్స్ లో బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు? అన్న రేంజ్ లో ట్విస్ట్ ఉండబోతున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి డైరెక్టర్ కొరటాల శివ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. పార్ట్ 2పై ఫ్యాన్స్ లో అంచనాలను పెంచే విధంగా ఈ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. దాంతో పాటుగా బాబీ డియోల్ పాత్రను కూడా క్లైమాక్స్ లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. పార్ట్ 1 క్లైమాక్స్ తోనే పార్ట్ 2పై భారీ హైప్ ను క్రియేట్ చేయాలని కొరటాల శివ అండ్ కో ప్లాన్ వేశారని తెలుస్తోంది. మరి చివరి 5 నిమిషాలు థియేటర్లలో సునామీ రావడం పక్కా అని స్వయంగా తారకే చెప్పడంతో.. అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి మరి దేవర క్లైమాక్స్ కు థియేటర్లు ఏ రేంజ్ లో షేక్ అవుతాయో.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş