iDreamPost
android-app
ios-app

Devara Movie: ‘దేవర’ మూవీ రన్​టైమ్ లాక్.. NTR రిస్క్ చేస్తున్నాడా?

  • Published Sep 11, 2024 | 9:58 PM Updated Updated Sep 11, 2024 | 10:20 PM

Devara Movie Runtime Locked: మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ రిలీజ్​కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. తాజాగా ఈ ఫిల్మ్ రన్ టైమ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.

Devara Movie Runtime Locked: మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ రిలీజ్​కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. తాజాగా ఈ ఫిల్మ్ రన్ టైమ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.

  • Published Sep 11, 2024 | 9:58 PMUpdated Sep 11, 2024 | 10:20 PM
Devara Movie: ‘దేవర’ మూవీ రన్​టైమ్ లాక్.. NTR రిస్క్ చేస్తున్నాడా?

మ్యాన్ ఆఫ్​ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ రిలీజ్​కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, సాంగ్స్ వచ్చి మంచి అప్లాజ్ అందుకున్నాయి. రీసెంట్​గా రిలీజ్ అయిన ట్రైలర్​కు కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆల్రెడీ ఎక్స్​పెక్టేషన్స్ ఆకాశాన్ని అందుతుండగా.. ట్రైలర్​తో అది నెక్స్ట్ లెవల్​కు వెళ్లిపోయింది. ఈ తరుణంలో మూవీ రన్​టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ‘దేవర’ రన్ టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న తారక్ ఫిల్మ్ రన్​టైమ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్ ఎక్కువ రన్​టైమ్​తోనే వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు ‘దేవర’ రన్​టైమ్ ఎంత? సెన్సార్ విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

‘దేవర’ ఫిల్మ్ సెన్సార్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు. దాదాపుగా మూడు గంటల రన్​టైమ్ ఉండనుంది. మూడు గంటలు అంటే తారక్-కొరటాల రిస్క్ చేస్తున్నారా? అంతసేపు ఆడియెన్స్​ను సీట్లకు కట్టిపడేయాలంటే మూవీ నెక్స్ట్ లెవల్​లో ఉండాలని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అయితే సాధారణంగా పెద్ద సినిమాలు కాస్త ఎక్కువ నిడివితోనే వస్తుంటాయి. ఆ లెక్కన చూసుకుంటే ‘దేవర’ రన్​టైమ్ కామన్ అనిపిస్తుంది. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్​లు అధికంగా ఉండటం, స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ నిడివి అవసరమని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం.

సినిమా కనెక్ట్ అయితే రన్​టైమ్ పెద్ద సమస్య కాదనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి మూవీస్ భారీ రన్​టైమ్​తోనూ బ్లాక్​బస్టర్స్​గా నిలిచాయి. చిత్రం బాగుంటే ఎంత ఎక్కువ సేపు ఉన్నా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కాబట్టి యాక్టింగ్​తో తారక్.. కథ, కథనం, మేకింగ్​తో కొరటాల కట్టిపడేస్తే ‘దేవర’కు రన్​టైమ్ బిగ్ ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఈ మూవీ నుంచి మంగళవారం ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో ఎన్టీఆర్ డైలాగ్స్, యాక్షన్ అదిరిపోయాయి. సముద్రం బ్యాక్​డ్రాప్​లో వచ్చే విజువల్స్, ముఖ్యంగా షార్క్​ను పట్టుకొని తారక్ సంద్రం నుంచి పైకి ఎగిరే సీన్స్ హైలైట్​గా నిలిచాయి. వాటికి అనిరుధ్ ఇచ్చిన బీజీఎం కూడా మంచి ఇంప్రెషన్ తీసుకుంది. ఒక్క రోజులో అన్ని భాషల్లో కలుపుకొని ట్రైలర్​కు 55 మిలియన్ల వ్యూస్ దక్కడం విశేషం. మరి.. ‘దేవర’ రన్​టైమ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.