iDreamPost
android-app
ios-app

Jr NTR: దేవర పాన్ ఇండియా ప్రమోషన్లకు ప్లస్ గా నిలవనున్న తారక్ టాలెంట్!

  • Published Sep 21, 2024 | 6:33 PM Updated Updated Sep 21, 2024 | 7:45 PM

Devara: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' తరువాత చేస్తున్న మూవీ 'దేవర'. పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

Devara: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' తరువాత చేస్తున్న మూవీ 'దేవర'. పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

  • Published Sep 21, 2024 | 6:33 PMUpdated Sep 21, 2024 | 7:45 PM
Jr NTR: దేవర పాన్ ఇండియా ప్రమోషన్లకు ప్లస్ గా నిలవనున్న తారక్ టాలెంట్!

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత చేస్తున్న మూవీ ‘దేవర’. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. యూ ట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రాబట్టాయి. ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల విడుదల అయిన ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ పై భారీ అంచనాలని పెంచేసింది. విడుదలకు టైమ్ దగ్గర పడటంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మకర్స్.

దేవర పాన్ ఇండియా మూవీ కాబట్టి పాన్ ఇండియా ఆడియన్స్ కి కచ్చితంగా రీచ్ అయ్యే విధంగా ఆకట్టుకోవాలి. జనాల్లో ఈ మూవీ పై బజ్ క్రియేట్ అవ్వాలి. ప్రమోషన్స్ ఆకట్టుకునే విధంగా చేయాలి. అయితే పాన్ ఇండియా ప్రమోషన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ ప్లస్ గా మారనుంది. తారక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అంతేగాక ఆయన ఫాస్ట్ లెర్నర్ కూడా. ఆయనకి చాలా ప్రాంతీయ భాషలు వచ్చు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ చాలా స్పష్టంగా మాట్లాడగలరు. ఒకవేళ భాష రాకపోయినా చాలా త్వరగా నేర్చుకొని మాట్లాడగలరు. గతంలో కూడా తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ టాలెంట్ కూడా దేవరకి బిగ్గెస్ట్ ప్లస్ గా నిలవనుంది. పాన్ ఇండియా ప్రేక్షకులకు తారక్ స్పీచ్ కచ్చితంగా రీచ్ అవుతుంది కాబట్టి ఇక దేవర ప్రమోషన్స్ కి తిరుగుండదు. సినిమా విడుదలయ్యాక కూడా తారక్ టాలెంట్ ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుతుంది. దాంతో ఇంకా ఎక్కువగా జనాలు మూవీని ఆదరిస్తారని మేకర్స్ భావిస్తున్నారు.

ఇక దేవర మూవీలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో ఈ సినిమా దిమ్మతిరిగే రికార్డులు క్రియేట్ చేసింది. ఇంకా క్రియేట్ చేస్తుంది కూడా. ఇక ఈ మూవీలో ఆయుధ పూజ సాంగ్ హైలెట్ గా నిలవనుందని సమాచారం తెలుస్తుంది. ఈ పాటకి థియేటర్లలో అభిమానులు పిచ్చెక్కిపోవడం ఖాయమాట. ఈ చిత్రానికి అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా యువసుధ ఆర్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది. మరి తారక్ టాలెంట్ ఈ మూవీకి బాగా ప్లస్ అవుతుంది అనే విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio