కేజీఎఫ్ 2కి ఇప్పటికిప్పుడు సీక్వెల్ లేదని తెల్సినా సరే, కేజీయఫ్ 3పై సోషల్ మీడియాలో హడావిడి నడుస్తూనే ఉంది. కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడంతోనే చాలా థియరీలు పుట్టుకొచ్చాయి. కేజీఎఫ్ ఫ్రాంఛైజీలోకి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట. కేజీఎఫ్ పూర్తిగా సౌత్ ఇండియన్ స్టార్ లతోనే నిండిపోతే, పెరిగిన క్రేజ్ ని బట్టి కేజీయఫ్ 2లో బాలీవుడ్ స్టార్స్ వచ్చారు. రమికా సేన్ గా […]
సాధారణంగా సినిమాల్లో హీరోకో హీరోయిన్ కో జబ్బు ఉండటం దాని చుట్టూ కథ నడవటం ఎన్నోసార్లు చూశాం. గీతాంజలిలో నాగార్జున, గజినీలో సూర్య, భలే భలే మగాడివోయ్ లో నాని ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉదాహరణలున్నాయి. అయితే నిజ జీవితంలోనూ కథానాయకులకు జబ్బులు ఉంటాయంటే ఆశ్చర్యం కలగకమానదు. చిన్నా చితక అయితే పట్టించుకోనవసరం లేదు కానీ ఇందులో కొన్ని ఆశ్చర్యం కలిగించేవి ఉన్నాయి. అవేంటో చూద్దాం. సల్మాన్ ఖాన్ కు ట్రైజెమినల్ న్యూరాల్జియా ఉంది. అంటే […]
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్న క్రైమ్-థ్రిల్లర్ “విక్రమ్ వేద” చిత్రం, 30 సెప్టెంబర్ 2022 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ సోమవారం ప్రకటించారు. హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో అతను “వేద”గా కనిపించనున్నారు. భారతీయ జానపద కథ ‘విక్రమ్ ఔర్ బేతాల్’ ఆధారంగా, ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ సినిమాలో […]
2017లో తమిళంలో వచ్చిన విక్రమ్ వేదా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో కోలీవుడ్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లకు బాగా తెలుసు. విజయ్ సేతుపతి-మాధవన్ కాంబోలో వచ్చిన ఈ టెర్రిఫిక్ పోలీస్ మాఫియా థ్రిల్లర్ కంటెంట్ లోనే కాదు కమర్షియల్ గానూ గొప్ప విజయం అందుకుంది. ఇది రిలీజైనప్పుడు బాహుబలిని దాటేస్తుందనే అంచనాలు కూడా వచ్చాయంటే ఏ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించిందో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ వేదా వచ్చాకే విజయ్ సేతుపతికి స్టార్ […]
టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ వయసుతో నిమిత్తం లేకుండా సాగుతుంది. ఎంత ఏజ్ బార్ అయినా కుర్ర హీరోయిన్ల పక్కన వీళ్ళను చూసేందుకు అభిమానులు ఎగబడుతూనే ఉంటారు. విషయానికి వస్తే టాలీవుడ్ లో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న పూజా హెగ్డేకు ఇటీవలే అల వైకుంఠపురములో రూపంలో ఇండస్ట్రీ హిట్ దక్కింది. గత ఏడాది మహర్షి అంతకు ముందు అరవింద సమేత వీర రాఘవ ఇలా ఎవరితో చేసినా అలా హిట్టు వచ్చి చేరిపోతోంది. […]
కొన్ని సినిమా విచిత్రాలు చూడడానికి వినడానికి భలే వింతగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఏదైనా సబ్జెక్ట్ ఒక భాషలో హిట్ అయ్యిందంటే మరో భాషలో డబ్బింగ్ లేదా రీమేక్ చేయడం సర్వసాధారణంగా జరిగేదే. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ అదే కథను సినిమాలగా తీస్తూ పోతే దాన్నేమంటారు. అలాంటి వింతలు పరిశ్రమలో బోలెడున్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం 32 ఏళ్ళ క్రితం అంటే 1988లో కృష్ణంరాజు, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో ప్రాణ స్నేహితులు అనే సినిమా […]
ఇక్కడి ఫోటోలో రజనీకాంత్ ఆప్యాయంగా కౌగిలించుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తు పట్టారా. తను ఎవరో కాదు తన డాన్స్ అండ్ యాక్టింగ్ తో హిందీ సినిమాల్లో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్సిన హృతిక్ రోషన్. బాల్యంలోనే నటన మొదలుపెట్టిన హృతిక్ కు ఆ వయసులోనే రజినితో నటించే అవకాశం దక్కింది. ఆ ముచ్చటే ఇది. 1986లో రజనీకాంత్ టైటిల్ రోల్ లో భగవాన్ దాదా అనే సినిమా వచ్చింది. హృతిక్ నాన్న రాకేష్ రోషన్ నిర్మాత కాగా […]
సినిమా పరిశ్రమ తీరే అంత. ఒక్క రోజులో జాతకాలు మారిపోతాయి. ఒక్క సినిమాతో జీవితాలు తలకిందులవుతాయి. కానీ ఏదీ ముందు ఊహించినట్టు జరగదు. దానికి ఉదాహరణగా హీరోయిన్ పూజా హెగ్డేనే తీసుకోవచ్చు. తను పరిశ్రమకు వచ్చి ఎనిమిదేళ్లు అయ్యింది. మొదటి సినిమా జీవా నటించిన ముగమూడి. తెలుగులో మాస్క్ పేరుతో డబ్ చేస్తే రెండు చోట్లా డిజాస్టర్. చాలా మందికి ఇది వచ్చిన సంగతి కూడా తెలియదు. తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేస్తే […]