iDreamPost
android-app
ios-app

Jr NTR: వార్ 2 నుంచి బిగ్ అప్డేట్.. NTR ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుంటారు..!

  • Published Oct 05, 2024 | 1:09 PM Updated Updated Oct 05, 2024 | 1:09 PM

Jr NTR- Hrithik Roshan Schedule For War 2: తారక్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు దేవర సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. అది ఎన్టీఆర్ రేంజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది.

Jr NTR- Hrithik Roshan Schedule For War 2: తారక్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు దేవర సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. అది ఎన్టీఆర్ రేంజ్ ని మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది.

  • Published Oct 05, 2024 | 1:09 PMUpdated Oct 05, 2024 | 1:09 PM
Jr NTR: వార్ 2 నుంచి బిగ్ అప్డేట్.. NTR ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుంటారు..!

దేవర.. దేవర.. దేవర.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ పేరు మారు మోగుతోంది. బాక్సాఫీస్ దేవర కలెక్షన్స్ సునామీలో కొట్టుకుపోతోంది. రికార్డుల వెంటబడి మరీ వాటి అంతు చూస్తున్నాడు. ఇప్పటికే దేవర మూవీ దాదాపుగా అన్నీ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసింది. ఇది దేవరోడి దెబ్బ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుంటున్నారు. ఈ మూవీతో కేవలం దేవర నిర్మాతలకే కాదు.. టాలీవుడ్ నిర్మాతలు అందరికీ ఒక నమ్మకం వచ్చింది. కంటెంట్ ఉంటే బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారని క్లారిటీ వచ్చింది. దేవర ఇచ్చిన ఈ హైని ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇప్పుడు ఇంకో క్రేజీ న్యూస్ అందుతోంది. అయితే అది కేవలం తెలుగు ప్రేక్షకులను కాదు.. బాలీవుడ్ వాళ్లని కూడా ఒక ఊపు ఊపేయబోతోంది. మరి.. ఆ క్రేజీ అప్ డేట్ ఏంటి? బాలీవుడ్ వాళ్లు కూడా ఎందుకు ఎగిరి గంతేస్తారో పూర్తి వివరాలు చూద్దాం.

ఎన్టీఆర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేవరతో పాటుగానే.. తారక్ బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తూ వచ్చాడు. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2లో ఎన్టీఆర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే వార్ 2 మూవీ షూటింగ్ కూడా శరవేగంగా పూర్తవుతోంది. ఎన్టీఆర్ తన పాత్రకు సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు ఇంకో షెడ్యూల్ కి వార్ 2 రెడీ అవుతోందంట. అది కూడా హృతిక్ రోషన్- తారక్ ఇద్దరి మధ్య ఈ షెడ్యూల్ ఉంటుందని చెబుతున్నారు.

ఈసారి షెడ్యూల్ లో హృతిక్, తారక్ ఇద్దరూ ఢీ అంటే ఢీ అనబోతున్నారు. అయితే అది పోరాట సన్నివేశాల్లో కాదులెండి. ఇద్దరి మధ్య మంచి మాస్ డ్యాన్స్ షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. వార్ 2కి సంబంధించి తారక్- హృతిక్ మధ్య మంచి సాంగ్ ఒకటి షూట్ చేయబోతున్నారంట. ఈ సాంగ్ లో హృతిక్ రోషన్- ఎన్టీఆర్ ఇద్దరూ తమ డ్యాన్స్ మూవ్స్ తో సినిమా లవర్స్ ని మంత్ర ముగ్దులను చేస్తారని చెబుతున్నారు. నిజానికి ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ డ్యాన్సర్స్ లిస్ట్ లో హృతిక్- ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా ఉంటాయి. అలాంటి స్టార్స్ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. స్క్రీన్స్ తగలబడిపోతాయేమో? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అక్టోబర్ మూడో వారంలో ఈ షెడ్యూల్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సాంగ్ కు వైభవి మర్చంట్ కొరియోగ్రాఫర్ వ్యవహరించనుందని చెబుతున్నారు.

మొత్తానికి దేవర ట్రీట్ తో పాటుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు వార్ 2 అప్ డేట్స్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక తారక్ సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న మూవీకి సంబంధించి పాన్ ఇండియా లెవల్లో బజ్ ఉంది. ఏకంగా 3 వేల కోట్లు కలెక్ట్ చేసే మూవీగా తెరకెక్కించాలని నీల్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే రిషబ్ శెట్టితో కూడా సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక మంచి కథ ఉంటే రిషబ్ శెట్టి- ఎన్టీఆర్ కాంబోలో మూవీ వస్తుంది. ఇంక దేవర పార్ట్ 2 కూడా ఉంది. ఇలా ఫుల్ బిజీగానే గడిపేస్తున్నాడు. మరి.. వార్ 2లో మాస్ జాతర ఉండబోతోంది అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet