iDreamPost
android-app
ios-app

జూనియర్ ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా? వార్ 2 క్యారెక్టర్ పై లీకులు!

జూనియర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూకి రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ డెబ్యూ విషయంలో పెద్దఎత్తున రిస్క్ చేసేందుకు రెడీ అయ్యాడనే టాక్ స్టార్ట్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్ హిందీ డెబ్యూకి రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ డెబ్యూ విషయంలో పెద్దఎత్తున రిస్క్ చేసేందుకు రెడీ అయ్యాడనే టాక్ స్టార్ట్ అయింది.

జూనియర్ ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా? వార్ 2 క్యారెక్టర్ పై లీకులు!

జూనియర్ ఎన్టీఆర్ నటన, టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పాన్ ఇండియా లెవల్లో తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇకపై తారక్ నుంచే వచ్చే అన్ని సినిమాలు దాదాపుగా పాన్ ఇండియా లెవల్లోనే ఉంటాయి. అంతేకాకుండా బాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ డెబ్యూ చేయబోతున్న విషయం కూడా తెలిసిందే. బీ టౌన్ డెబ్యూ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. ఏకంగా హృతిక్ రోషన్ వార్ 2లో తారక్ నటించబోతున్నాడు అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కానీ, టైగర్ 3 సినిమాలో మాత్రం ఓ హింట్ ఇచ్చారని చెబుతున్నారు.

నవంబర్ 12న సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి అనుకున్నంత ఆదరణ అయితే వచ్చినట్లు లేదు. యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. కథ, కథనం అంతా రొటీన్ గా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే సినిమాలో ఎక్కడా అంత గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ కూడా ఏమీ లేవని చెబుతున్నారు. అంతేకాకుండా హృతిక్ రోషన్ ఎంట్రీని కూడా మరీ ఓ రేంజ్ లో ఏమీ చూపించలేదంట. కేవలం ఒక సీన్ తోనే సరిపెట్టారు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తాడని వచ్చిన వార్తలు మాత్రం కేవలం ప్రచారం మాత్రమే అనే విషయం తేలిపోయింది. ఎందుకంటే టైగర్ 3లో తారక్ క్యామియో రోల్ లేదు.

తారక్ క్యారెక్టర్ గురించి అయితే లీకులు వచ్చాయని చెబుతున్నారు. కానీ, ఆ లీకులు చూస్తే తారక్ అభిమానుల్లో కాస్త కంగారు స్టార్ట్ అయింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ రోల్ లో ఉండబోతోంది అని చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. టైగర్ 3లో హృతిక్ కోసం ఓ సీన్ రాసుకున్నారు. అందులో ఒక ఎలివేషన్ డైలాగ్ చెప్పారు. ఒక ఫైట్ సీన్ పెట్టారు. ఈ మూవీలో రా చీఫ్ తో ఒక డైలాగ్ చెప్పించారు. “సైతాన్ కంటే కరుడుగట్టిన ఒకడు వచ్చాడు. వాడితో తలపడాలి అంటే వాడికన్నా దారుణంగా మారిపోవాలి” అంటూ చెప్పారు. అయితే ఆ క్యారెక్ట్ చేయబోయేది తారక్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో డెబ్యూ కోసం జూనియర్ ఎన్టీఆర్ అలాంటి ఒక నెగిటివ్ రోల్ ని ఎంచుకుంటాడా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తారక్ ఎందుకో రిస్క్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

డెబ్యూ కోసం ఏదైనా కీలక పాత్రను, హీరో పాత్రను ఎంచుకుంటే బాగుంటుందనే సూచనలు కూడా వస్తున్నాయి. హిందీ డెబ్యూ కోసం హృతిక్ రోషన్ చిత్రం కంటే గొప్ప సినిమా ఏముంటుందని కూడా అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు. హృతిక్ రోషన్ ను ఢీ కొట్టే పాత్ర అంటే కచ్చితంగా అంతే స్ట్రాంగ్ గా ఉంటుందని.. కాబట్టి తారక్ కు మంచి స్కోప్ ఉంటుందని చెబుతున్నారు. అలాంటి పాత్ర అయితే హిందీ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరవుతారంటూ సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ లీకులు మాత్రమే. ఏదీ కూడా అధికారికం కాదు. ప్రస్తుతం తారక్ అభిమానులు అంతా దేవర సినిమాపైనే కాన్సన్ ట్రేట్ చేశారు. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నారు. తారక్ నెగిటివ్ రోల్ చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.