హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా, వాళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వార్ 2 కోసం కళ్లు చెదిరే పారితోషికం తీసుకుంటున్నాడట యంగ్ టైగర్.
హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా, వాళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. వార్ 2 కోసం కళ్లు చెదిరే పారితోషికం తీసుకుంటున్నాడట యంగ్ టైగర్.
పాన్ ఇండియా సినిమా ఎఫెక్టు స్టార్స్ కెరీర్స్ ని మామ్మూలుగా ప్రభావితం చేయడం లేదు. దీని వల్ల ఒక ప్రాంతీయ భాషా పరిశ్రమలో ఓ స్టార్ తీసుకునే రెమ్యూనరేషన్ కన్నా ఈ రోజున ఎక్కువ తీసుకునే లేదా నిర్మాత ఇవ్వగలిగే సౌలభ్యం వచ్చింది. ఓటీటీలు కూడా ఈ విషయంలో చాలా వరకూ తమ పాత్రను ప్లే చేస్తున్నాయనుకోండి. ఓటీటీ రేట్లను బట్టి కూడా కొందరు హీరోలు రెమ్యూనరేషన్లు పెంచుతున్నారని పరిశ్రమలో పెద్ద టాకే వినిపిస్తోంది. కానీ పాన్ ఇండియా వ్యవహరం అదికాదు. అక్కడి గేమ్ వేరు. దాని డైమన్షన్ వేరు. దాని ఈక్వేషనే కంప్లీట్ గా వేరు. పైగా సౌత్ సినిమాలు ఎప్పుడైతే బాలీవుడ్ ని డామినేట్ చేయడం మొదలెట్టాయో సౌత్ స్టార్స్ లెవెలే మారిపోయింది. హిందీ రామాయణంలో రావణుడి పాత్రను పోషించడానికి యశ్ 150 కోట్లు తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియానే ప్రకటించింది.
ఇప్పడు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. RRR సినిమా మొత్తం ప్రపంచమంతా బాదేసిన తర్వాత రామ్ చరణ్ కేమో హాలీవుడ్ సినిమా ఆఫర్లు తన్నుకొచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ డెవలప్ అయింది. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా, వాళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అదీ పాన్ ఇండియా మూవీల ఎఫెక్టు ప్లస్ ఆర్ఆర్ఆర్ గ్రేట్నెస్.
వార్ 2 మూవీ కోసం యంగ్ టైగర్ అక్షరాలా వంద కోట్లు డిమాండ్ చేశాడని పెద్ద టాకే నడిచిందా మధ్యన. కానీ అదే నిజమని స్టేజ్ బై స్టేజ్ రివీల్ అవుతూ వస్తోంది. జూనియర్ అడిగిన వంద కోట్ల ఫిగర్ని వార్2 వాళ్ళు ఓకే చేశారని తాజా అప్డేట్. కాకపోతే ఇందులో చిన్న మెలిక ఉంది. అదేంటంటే? వంద కోట్లు జూనియర్ ఎన్టీఆర్ కి ఒకే మొత్తంగా పే చెయ్యరని, ప్రాఫిట్ షేరింగ్ బేస్ మీదనే సదరు వంద కోట్లు ముడతాయని మరో సమాచారం. దీనికి ఎన్టీఆర్ అంగీకార ముద్రవేసి అగ్రిమెంటుపై సైన్ చేశాడని కూడా చెబుతున్నారు. ఎంతసేపూ హిందీవాళ్ళే మన తెలుగు మేకర్స్ సినిమాల్లో సాక్షాత్కరించడమే కానీ, తెలుగు స్టార్స్ హిందీలో సైన్ చేయడం ఇటీవలి రోజులలో ఇదే మొదటిసారి.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుత లైనప్ చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. కొరటాల శివతో దేవర, తర్వాత ప్రశాంత్ నీల్ తో కలసి 31, మధ్యలో కన్నడ కాంతార, త్వరలో హృతిక్ రోషన్ తో వార్ 2 ఇలా కట్టుదిట్టంగానే ఉంది ఎన్టీఆర్ డౌన్ ద లైన్..ఫ్రేం. అఫ్ కోర్స్.. ఇది మొదలు. బాలీవుడ్ లో మనవాళ్ళ విస్ఫోటనం. ఇంకా ఎంతమంది మనవాళ్ళని కోరుకున్నా ఆశ్చర్యం లేదు. బాలీవుడ్ సినిమాలు దక్షిణాది స్టార్స్ లేకుండా మనగలిగే రోజులు పోయాయి. అక్కడిప్పుడు అమితాబచ్చన్లు ఎవరూ లేరు. మనవాళ్ళ మీద ఆదారపడాల్సిందే.
ఇదికూడా చదవండి: నటి ఐశ్వర్య- శ్యామ్ ఎపిసోడ్ లో అసలు తప్పు ఎవరిది?