iDreamPost
android-app
ios-app

Jr.NTR ని వదల్లేకపోతున్న బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్!

  • Published Nov 25, 2024 | 3:06 PM Updated Updated Nov 25, 2024 | 3:06 PM

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

  • Published Nov 25, 2024 | 3:06 PMUpdated Nov 25, 2024 | 3:06 PM
Jr.NTR ని వదల్లేకపోతున్న బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరోగా సూపర్ స్టార్ డంని ఎంజాయ్ చేస్తున్నాడు. తారక్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి డైరెక్టర్ కి కూడా తారక్ తో వర్క్ అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయనతో చాలా కంఫర్ట్ ఉంటుంది. ఏదైనా కానీ చాలా త్వరగా క్యాచ్ చేసే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన. తారక్ టైమింగ్ నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తార‌క్ స్పీడ్ ఇత‌రులు అందుకోలేనంత స్పీడ్ గా ఉంటుంది. అందుకే ఆయన టాలెంట్ కి ఎవ్వరైనా కూడా పిచ్చ ఫిదా అవ్వాల్సిందే. ఆయనతో ఒక్కసారి పని చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. అంతలా ఇంప్రెస్ చేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ టాప్ బ్యానర్ సైతం ఆయన ప్రతిభకి ఫుల్ ఫిదా అయ్యింది. తారక్ తో ఒక సినిమా చేస్తే సరిపోదు అనుకుంది. అంతలా మన తారక రాముడు తన టాలెంట్ తో ఫిదా చేశాడు. ఇంతకీ ఆ టాప్ బ్యానర్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం తారక్ బాలీవుడ్ లో ‘వార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. యష్ రాజ్ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ లో క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అలాంటిది ఈ బ్యానర్ నుంచి వస్తున్న వార్ 2 పై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాలో తారక్ యాక్టింగ్ స్కిల్స్ కి మూవీ యూనిట్ ఫుల్ ఫిదా అయ్యిందట. అలాగే యష్ రాజ్ బ్యానర్ కూడా మన తారక రాముడి పని తనానికి అట్రాక్ట్ అయ్యిందని తెలుస్తుంది.

అందుకే కేవలం వార్ 2తో తార‌క్ ని వదలకూడదని ఫిక్స్ అయ్యిందట. ఆయతో వ‌రుస‌గా మూడు చిత్రాల‌కు య‌ష్ రాజ్ ఫిలింస్ లాక్ చేస్తోంద‌ని తెలుస్తుంది.ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ బ్యానర్ తో వరుస సినిమాలు చేసేందుకు అంగీకరించాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అయితే అతి త్వరలో తన రెండో హిందీ సినిమాకు సైన్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet