Dharani
Hrithik Roshan: స్టార్ హీరో ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిలో ఆయన ఫొటో చూస్తే తీవ్రంగా గాయపడ్డట్టు అర్థం అవుతోంది. ఇంతకు ఏం జరిగింది అంటే..
Hrithik Roshan: స్టార్ హీరో ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిలో ఆయన ఫొటో చూస్తే తీవ్రంగా గాయపడ్డట్టు అర్థం అవుతోంది. ఇంతకు ఏం జరిగింది అంటే..
Dharani
స్టార్ హీరో చేసిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన పోస్ట్ చేసిన ఫొటో చూస్తే సదరు హీరో తీవ్రంగానే గాయపడ్డట్టు అనిపిస్తోంది. కాళ్లు, వెన్నెముక విరిగినట్లు తెలుస్తోంది. పైగా సదరు హీరో మీలో ఎంతమందికి క్రచ్, వీల్‌చైర్‌పై ఉండాల్సిన అవసరం ఉంది.. గతంలో మీకెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా.. అప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు.. అని ప్రశ్నించాడు. దాంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. అసలేం జరిగింది ఒంటికి ఆ కట్లు ఏంటి.. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది అంటూ వరుసగా ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరి ఇంతకు ఎవరా హీరో.. అసలు ఆయనకు ఏం జరిగింది అంటే..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆయన చేసిన పోస్ట్ చూసిన అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటోలో హృతిక్ రోషన్ నడుముకు పట్టీ కనిపిస్తోంది. ఇక క్రచెస్ పట్టుకుని నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే హృతిక్ తాను గాయపడ్డ విషయం డైరెక్ట్‌గా చెప్పకుండా.. ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసి అభిమానులను గందరగోళానికి గురి చేశాడు. ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
దీనిలో హృతిక్.. మీలో ఎంతమందికి క్రచ్‌లు, వీల్ చైర్‌పై ఉండాల్సిన అవసరం ఉంది.. ఒక్కసారైనా మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారా.. అప్పుడు మీకు ఎలా అనిపించింది అని ప్రశ్నించాడు. అంతేకాక ఈ సందర్భంగా తన తాతగారితో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు హృతీక్. ‘‘నాకు బాగా గుర్తుంది.. మా తాత ఎయిర్‌పోర్ట్‌లో వీల్ చైర్‌పై కూర్చోవడానికి ససేమీరా ఒప్పుకోలేదు. ఎందుకంటే అది తనను తాను బలహీనమైన వాడినని గుర్తు చేస్తుందట. అప్పుడు నేను ఆయనతో ఈ వీల్ చైర్ మీ గాయాన్ని నయం చేయడంలో సహాయపడుతుంది అని చెప్పాను. అప్పుడు ఆ విషయం మా తాతను చాలా బాధించింది’’ అని గుర్తు చేసుకున్నాడు..
‘‘ఇలా అన్నింటిని భరించడం, ధైర్యంగా ఉండటం సైనికుడి మనస్తత్వం. మా నాన్న కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. కానీ సైనికులెప్పుడూ ఇలాంటి (వీల్ చైర్స్‌ను)వాటిని వాడేందుకు ఇష్టపడరు.. నిజమైన బలం అనేది ఇలా వీల్ చైర్స్, క్రచెస్ పట్టుకోవడంలో ఉండదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. మీ జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే.. అవసరమైతే ఇలాంటివి వాడండి.. త్వరగా కోలుకోండి.. వీల్‌చైర్, క్లచెస్ వాడటానికి మోహమాటపడకండి అంటూ సలహా ఇచ్చాడు హృతిక్ రోషన్. ప్రస్తుతం గాయం నుంచి కోలుకునేందుకు తాను అదే పని చేస్తున్నట్లు ఇండైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు.
అయితే తనకు ఈ గాయాలు ఎలా అయ్యాయి.. ప్రమాదం ఎప్పుడు జరిగింది.. ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం అనే విషయాల గురించి మాత్రం వెల్లడించలేదు. దాంతో కొందరు నెటిజనులు.. ఇది నిజమేనా.. లేక ఏదైనా ప్రాంకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ కొన్ని రోజుల క్రితమే ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం హృతిక్ వార్ 2 కోసం రెడీ అవుతున్నాడు. ఈ సమయంలో ఇలా ప్రమాదానికి గురి కావడం చూసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.