iDreamPost
android-app
ios-app

వార్ -2 లో చిన్న పాత్రకి అన్ని కోట్లా? ఇది NTR రేంజ్!

  • Published Mar 07, 2024 | 3:01 PM Updated Updated Mar 07, 2024 | 3:01 PM

Jr NTR Remuneration For War 2 Movie: జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ చూస్తుంటే తారలకు పిచ్చెక్కిపోతోంది. రోజు రోజుకు తారక్ రేంజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు వార్ 2 కోసం తారక్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలే అందుకు నిదర్శనం.

Jr NTR Remuneration For War 2 Movie: జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ చూస్తుంటే తారలకు పిచ్చెక్కిపోతోంది. రోజు రోజుకు తారక్ రేంజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు వార్ 2 కోసం తారక్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలే అందుకు నిదర్శనం.

  • Published Mar 07, 2024 | 3:01 PMUpdated Mar 07, 2024 | 3:01 PM
వార్ -2 లో చిన్న పాత్రకి అన్ని కోట్లా? ఇది NTR రేంజ్!

జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ఈ గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అయిపోయిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ హీరో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వాటిని రెట్టింగు చేస్తూ కొరటాల శివతో పాన్ ఇండియా లెవల్లో దేవర పార్ట్ 1 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అయితే వీటి మధ్యలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో హృతిక్ రోషన్ తో కలిసి తారక్ వార్ 2 మూవీలో చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు టాలీవుడ్ నే కాదు.. బీ టౌన్ తారలను కూడా కుళ్లుకునేలా చేస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి, నటన గురించి పాన్ ఇండియానే కాదు.. వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకులకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంత గొప్ప నటుడు కాబట్టే ఈమధ్యలో ఏ సౌత్ స్టార్ కు దక్కని స్పై యూనివర్స్ లో పాత్ర తారక్ ను వరించింది. బాలీవుడ్ కి ఎంట్రీనే అదిరిపోయే మూవీతో ఇస్తున్నాడు. ఏకంగా హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా జరిగింది. ఆ విషయాన్ని స్వయంగా హృతిక్ రోషన్ వెల్లడించాడు. ఈ మూవీలో తారక్ పాత్రకు సంబంధించి చాలానే వార్తలు వచ్చాయి.

మొదట అందరూ హృతిక్ రోషన్ కు విలన్ కు చేస్తున్నాడు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త వాదన వినిపిస్తోంది. అదేంటంటే.. వార్ 2లో పూర్తి పాజిటివ్ యాంగిల్స్ లోనే తారక్ పాత్ర ఉంటుంది అంటున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఆధారంగా స్పై యూనివర్స్ లో సోలో మూవీ ఉంటుందంట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్ తారక్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు మాత్రం బీ టౌన్ తారలను కూడా కుళ్లుకునేలా చేస్తున్నాయంట. వార్ 2లో తారక్ పాత్ర మరీ పెద్దది ఏం అయ్యుండదు. క్యామియోకి ఎక్కువగా ఒక అతిథి పాత్ర తరహాలో ఉండే ఛాన్స్ ఉంటుంది.

మహా అయితే వార్ 2 సినిమాలో తారక్ పాత్ర ఒక 30 నిమిషాల వరకు కనిపించవచ్చు. అయితే అంత పాత్ర కోసమే.. తారక్ కు ఏకంగా రూ.100 కోట్లు పారితోషకం ఇస్తున్నారంట. అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు గ్లోబల్ గా వచ్చిన క్రేజ్ ని ఆధారంగా చేసుకుని ఈ పారితోషకాన్ని ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ర్యాపిడ్ షేరింగ్ విధానంలో జూనియర్ ఎన్టీఆర్ కు అందజేస్తారంట. ఇప్పుడు వార్ 2లో పాత్ర కోసమే ఇంత తీసుకుంటే.. రేపు ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తే ఎంత తీసుకుంటాడు? స్పై యూనివర్స్ లో వన్ ఆఫ్ ది హీరోగా ఫుల్ మూవీ చేస్తే అప్పుడు రెమ్యూనరేషన్ రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు ఉంటుందేమో అని గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.

ఇప్పుడు ఈ వార్తలే బాలీవుడ్ తారలకు నిద్ర పట్టకుండా చేస్తోందంట. తారక్ వల్ల వాళ్లకు కంటి మీద నిద్ర లేకుండా పోయే పరిస్థితి దగ్గరలోనే ఉంది అంటున్నారు. పైగా తారక్ రెమ్యూనరేషన్ వాళ్లు ఒకింత కుళ్లుకునేలా చేస్తోందంట. చుట్టపు చూపు కోసం వచ్చి రూ.100 కోట్లు పట్టుకుపోతున్నాడు అంటే ఆమాత్రం మండుతుంది లెండి. పైగా సౌత్ అన్నా, ఇక్కడి తారలన్నా బాలీవుడ్ ఎప్పుడూ కుళ్లుకుంటూనే ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి.. తారక్ రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet