iDreamPost
android-app
ios-app

చిక్కుల్లో స్టార్ హీరో.. లీగల్ నోటీసులు పంపిన అధికారి!

  • Published Feb 06, 2024 | 4:07 PM Updated Updated Feb 06, 2024 | 4:07 PM

ఓ స్టార్ హీరో చిక్కుల్లో పడ్డాడు. అతడితో పాటుగా స్టార్ హీరోయిన్ కూడా చిక్కుల్లో పడింది. ఓ సినిమా విషయంలో లీగల్ నోటీసులు ఎదుర్కొవాల్సి వస్తోంది వీరిద్దరు. మరి ఆ హీరో, హీరోయిన్ ఎవరు? ఆ మూవీ ఏది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఓ స్టార్ హీరో చిక్కుల్లో పడ్డాడు. అతడితో పాటుగా స్టార్ హీరోయిన్ కూడా చిక్కుల్లో పడింది. ఓ సినిమా విషయంలో లీగల్ నోటీసులు ఎదుర్కొవాల్సి వస్తోంది వీరిద్దరు. మరి ఆ హీరో, హీరోయిన్ ఎవరు? ఆ మూవీ ఏది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Published Feb 06, 2024 | 4:07 PMUpdated Feb 06, 2024 | 4:07 PM
చిక్కుల్లో స్టార్ హీరో.. లీగల్ నోటీసులు పంపిన అధికారి!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సందర్భాల్లో హీరోలు, హీరోయిన్స్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అవి ఆర్థికపరమైన లేదా చట్ట పరమైనవి కావొచ్చు. తాజాగా ఓ స్టార్ హీరో చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. హీరోతో పాటుగా ఆ మూవీ మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపారు ఐఏఎఫ్ అధికారి సౌమ్యదీప్ దాస్. మరి ఆ హీరో ఎవరు? ఆ మూవీ ఏది? లీగల్ నోటీసులు పంపేంత తప్పు ఆ సినిమాలో ఏముంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ స్టార్ హీరో, అమ్మాయిల కలల రాకుమారుడు హృతిక్ రోషన్ లేటెస్ట్ గా నటించిన సినిమా ‘ఫైటర్’. ఇందులో హృతిక్ కు జోడీగా గ్లామర్ బ్యూటీ దీపికా పదుకొణె నటించగా.. స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ఈ మూవీని తెరకెక్కించాడు. జనవరి 25న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 302 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీ టీమ్ కు లీగల్ నోటీసులు పంపారు ఐఏఎఫ్ ఆఫీసర్ సౌమ్యదీప్ దాస్. దానికి కారణం ఏంటంటే? ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో హృతిక్-దీపికాలు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ గా నటించారు.

అయితే ఇందులో వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ గా డ్యూటీ టైమ్ లోనే రొమాన్స్ చేయడం ఏంటి? ఇది ఎయిర్ ఫోర్స్ గౌరవాన్ని కించపరచడమే అని అధికారి నోటీసుల్లో పేర్కొన్నారు. యూనిఫామ్ వేసుకుని అసాంఘీక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా యూనిఫామ్ పవిత్రత, ప్రాముఖ్యతకు తీవ్ర విఘాతం కలిగించారని నోటీసులో చెప్పుకొచ్చారు. ఈ విషయంపై ఫైటర్ ప్రొడక్షన్ టీమ్ పై, మూవీ యూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే ఈ లీగల్ నోటీసులపై ఫైటర్ మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఫైటర్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫైటర్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 29న స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదికూడా చదవండి: రవితేజనే ఫిదా చేసిన వైజాగ్ ర్యాపర్.. ఎవరీ సాయి చరణ్?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss