Nidhan
Bollywood: ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఫేమ్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అందుకే సినీ తారలు ఎప్పటికప్పుడు తమను తాము మరింత మెరుగుపర్చుకుంటూ ఉంటారు.
Bollywood: ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఫేమ్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అందుకే సినీ తారలు ఎప్పటికప్పుడు తమను తాము మరింత మెరుగుపర్చుకుంటూ ఉంటారు.
Nidhan
ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఫేమ్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. అందుకే సినీ తారలు ఎప్పటికప్పుడు తమను తాము మరింత మెరుగుపర్చుకుంటారు. యాక్టింగ్ పరంగా మరింత బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఫిట్నెస్ను, అందాన్ని కాపాడుకోవడంపై ఫోకస్ పెడతారు. అయితే ఈ క్రమంలో కొందరు నటులు ఇతరులతో పోల్చుకొని వారిలా మారేందుకు ట్రై చేసి ఫెయిలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. సిక్స్ ప్యాక్‌లు, జీరో సైజ్‌ల కోసం ప్రయత్నించి కొందరు నటులు సక్సెస్ అయితే.. మరికొందరు విఫలమవడం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
ఒక బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఇలాగే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏకంగా స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నాడు. బడా స్టార్ల మాదిరిగా ఫిట్‌గా కనిపించాలని ఎంత ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఆ నటుడు మరెవరో కాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. ‘జానే తు యా.. జేనా నా’, ‘ఢిల్లీ బెల్లీ’ లాంటి హిట్ చిత్రాలతో సంచలనం రేపిన ఈ హీరో.. 2015 తర్వాత ఫేడ్ అవుట్ అయ్యాడు. తాజాగా తన కెరీర్ గురించి అతడు మాట్లాడుతూ.. ఇతర హీరోల్లా కనిపించాలనే తాపత్రయంలో ఓ దశలో స్టెరాయిడ్స్ వాడానని రివీల్ చేశాడు.
ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఇమ్రాన్ తన కెరీర్‌కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే స్టెరాయిడ్ల వాడకం గురించి రివీల్ చేశాడు. ‘కెరీర్ విషయంలో నాకు అభద్రతా భావం ఉండేది. యాక్టర్‌గా సక్సెస్ కాగలనా అనే డౌట్స్ వచ్చేవి. కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి సందేహాలతో చాలా ఇబ్బంది పడ్డా. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్‌లా సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలని ఆ దిశగా ప్రయత్నించా. అందుకోసం స్టెరాయిడ్స్ కూడా ఉపయోగించా. అయితే లుక్ కోసం ఇలాంటి కెమికల్స్‌ను యూజ్ చేసినా వేస్ట్ అని తర్వాత అర్థమైంది. ఇండస్ట్రీలో ఫేమ్ వచ్చాక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్లు మాత్రమే గ్లామర్ మీద ఫోకస్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోలు కూడా ఈ విషయంపై దృష్టి పెడుతూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు’ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.