iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్ లేకుండా షెడ్యూల్ కంప్లీట్! ఆ స్థానంలోకి ఎవరొచ్చారంటే..

  • Author ajaykrishna Published - 04:47 PM, Thu - 26 October 23

బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ.. పైగా మల్టీస్టారర్.. ఒక హీరో మాత్రమే షూట్ కి అందుబాటులో ఉన్నాడు.. ఇంకో హీరో ఎన్టీఆర్ లేకుండా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన డైరెక్టర్. మరి డైరెక్టర్ ఎన్టీఆర్ ప్లేస్ లో ఎవరిని పెట్టి షూటింగ్ చేశాడు.. ఆ వివరాల్లోకి వెళ్దాం..

బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ.. పైగా మల్టీస్టారర్.. ఒక హీరో మాత్రమే షూట్ కి అందుబాటులో ఉన్నాడు.. ఇంకో హీరో ఎన్టీఆర్ లేకుండా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన డైరెక్టర్. మరి డైరెక్టర్ ఎన్టీఆర్ ప్లేస్ లో ఎవరిని పెట్టి షూటింగ్ చేశాడు.. ఆ వివరాల్లోకి వెళ్దాం..

  • Author ajaykrishna Published - 04:47 PM, Thu - 26 October 23
ఎన్టీఆర్ లేకుండా షెడ్యూల్ కంప్లీట్! ఆ స్థానంలోకి ఎవరొచ్చారంటే..

ఇండస్ట్రీలో కొన్నిసార్లు సినిమా షూటింగ్స్ కి సంబంధించి క్రేజీ వార్తలు వింటుంటాం. ముఖ్యంగా బిగ్గెస్ట్ బడ్జెట్ తో.. బిగ్ స్కేల్ లో ప్లాన్ చేసిన సినిమాలు ఎప్పటికప్పుడు ఎక్సయిట్ మెంట్ కలిగిస్తుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. అలా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ఇటీవల దర్శకుడు కొరటాల క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సూపర్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది.

ఇక దేవర ఒకటే కాకుండా.. అటు కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా.. ఇటు బాలీవుడ్ యష్ రాజ్ ఫిలిమ్స్ లో ‘వార్ 2’ మూవీస్ ఓకే చేశాడు ఎన్టీఆర్. బ్రహ్మస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 మూవీ షూటింగ్ తాజాగా స్పెయిన్ లో జరిగింది. వారం రోజుల పాటు జరిగిన షెడ్యూల్ లో భారీ చేజింగ్ సీక్వెన్స్ కంప్లీట్ చేశారట. ఈ షెడ్యూల్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ పాల్గొనగా.. ఎన్టీఆర్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ దేవర షూట్ లో బిజీగా ఉన్నాడు. అయితే.. వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతోంది. మొన్నటివరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్.. ఈ స్పెయిన్ షెడ్యూల్ తోనే మొదలైంది.

ఇదిలా ఉండగా.. వార్ 2 షెడ్యూల్ ని ఎన్టీఆర్ లేకుండానే షెడ్యూల్ కంప్లీట్ చేశారట. షూట్ లో హృతిక్ రోషన్ పాల్గొన్నాడు. అయితే.. ఎన్టీఆర్ కి బదులుగా డూప్ ని పెట్టి చేశారని సమాచారం. ఎందుకంటే.. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ కూడా ఉండాల్సిన అవసరం ఉందట. కానీ.. దేవర కారణంగా ఎన్టీఆర్ వార్ 2 షెడ్యూల్ లో పాల్గొనలేకపోయాడని చెబుతున్నారు. ప్రస్తుతం వార్ 2 హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే షూటింగ్ లొకేషన్ స్పాట్ పిక్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఒకవేళ ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొనుంటే ఖచ్చితంగా పిక్స్ బయటికి వచ్చేవని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక వార్ 2లో ఎన్టీఆర్ ఎప్పుడు జాయిన్ అవుతాడు? హృతిక్ తో ఎన్టీఆర్ ని ఎప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి వార్ 2 మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/