iDreamPost
android-app
ios-app

WAR2 Movie: వార్ 2 లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు?

  • Published Mar 13, 2024 | 1:27 PM Updated Updated Mar 13, 2024 | 1:31 PM

ఇక దేవర షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో, తారక్ వార్ 2 కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లే జరిగితే, ఏప్రిల్‌లో వార్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది.అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించేందుకు ఇద్దరు హీరోయిన్ల పేర్లు పుకార్లలో వినిపిస్తున్నాయి.

ఇక దేవర షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో, తారక్ వార్ 2 కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లే జరిగితే, ఏప్రిల్‌లో వార్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది.అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించేందుకు ఇద్దరు హీరోయిన్ల పేర్లు పుకార్లలో వినిపిస్తున్నాయి.

  • Published Mar 13, 2024 | 1:27 PMUpdated Mar 13, 2024 | 1:31 PM
WAR2 Movie: వార్ 2 లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు?

ఆర్ ఆర్ ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత హీరో ఎన్టీఆర్ మరో భారీ సినిమా దేవరను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాంతో పాటు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. కాగా ఈ సినిమాలో ఇండియన్ గ్రీక్ గాడ్ హృతిక్-రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వార్ 2 మరో షెడ్యూల్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది.

గతంలో ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో తెలిపిన హృతిక్ రోషన్ అభిమానులని అలరించారు. ఇక దేవర షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో, తారక్ వార్ 2 కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లే జరిగితే, ఏప్రిల్‌లో వార్ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించేందుకు ఇద్దరు హీరోయిన్ల పేర్లు పుకార్లలో వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ పాత్రకి కియారా అద్వానీని తీసుకుంటున్నట్లు వినిపించినా… ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపిస్తుంది. నిజానికి కియారా భరత్ అనే నేను, వినయ విధేయ రామా సినిమాలతో తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక ఈ వేసవిలో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ తో మరో బిగ్ హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్నారు. అలాగే రణవీర్ సింగ్ తో డాన్ 3 సినిమాలో కూడా ఆమె ఇటీవలే కథానాయికగా ఎంపికైంది. వార్ 2లో గనక కియారా అద్వానీ నటిస్తే, ఖచ్చితంగా సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. ఒకవేళ ఆ అవకాశం మృణాల్ కు దక్కితే ఆమెకు లభించిన తొలి బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ అవుతుంది.

Mrunal Thakur

ఇక వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. పాత్రలో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని, హ్రితిక్ తో కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ లలో పాల్గొంటారని అంటున్నారు. అలాగే వార్ 2 పూర్తయిన తర్వాత తారక్ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లోనే స్పై యూనివర్స్ లో ఒక సెపరేట్ యాక్షన్ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈలోపు దేవర రిలీజ్ అయి హిట్ అయితే వార్ 2 పై కూడా అంచనాలు భారీగానే ఉంటాయి. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ తో కియారా, మృణాల్ లలో ఒకరే నటిస్తారో లేదా ఇద్దరూ కలిసి నటిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

ఎన్టీఆర్ హీరోయిన్ పై రూమర్స్ వార్

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş