iDreamPost
android-app
ios-app

Prabhas: నెంబర్. 1 గా ప్రభాస్.. హృతిక్ రోషన్ ను వెనక్కినెట్టి..!

  • Published Jul 09, 2024 | 7:53 PM Updated Updated Jul 09, 2024 | 7:53 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ షేక్ అయ్యింది. ఏకంగా స్టార్ హీరో హృతిక్ రోషన్ నే వెనక్కినెట్టి మరీ నెం.1 హీరోగా నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ షేక్ అయ్యింది. ఏకంగా స్టార్ హీరో హృతిక్ రోషన్ నే వెనక్కినెట్టి మరీ నెం.1 హీరోగా నిలిచాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Prabhas: నెంబర్. 1 గా ప్రభాస్.. హృతిక్ రోషన్ ను వెనక్కినెట్టి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు అతి దగ్గరలో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా బాలీవుడ్, ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఏ రేంజ్ అంచనాలతో బరిలోకి దిగిందో.. అంతకంటే ఎక్కువ కలెక్షన్లను రాబడుతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలోనే హిందీ మార్కెట్ పై తన రెబల్ పంజా విసిరాడు. దాంతో బాలీవుడ్ షేక్ అయ్యింది. హృతిక్ రోషన్ ను వెనక్కినెట్టి మరీ నెం. 1 హీరోగా అవతరించాడు ప్రభాస్.

హిందీ మార్కెట్ పై ప్రభాస్ పంజా విసిరాడు. రెబలోడి ధాటికి రికార్డులు సలామ్ అంటూ గులామ్ గా మారాయి. అసలు విషయం ఏంటంటే? ఈ ఏడాది హిందీ అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన మూవీగా హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ చిత్రం నిలిచింది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీ రూ. 215 కోట్ల నెట్ వసూళ్లను లైఫ్ టైమ్ లో అందుకుంది. అయితే ఈ రికార్డును రెండు వారాలు పూర్తికాకముందే కల్కి చిత్రం ద్వారా ప్రభాస్ బ్రేక్ చేశాడు. ఇప్పటికే బాలీవుడ్ లో కల్కి రూ. 219 కోట్ల వసూళ్లను సాధించి.. స్టడీగా దూసుకెళ్తోంది.

కాగా.. ఈ ఏడాది బాలీవుడ్ గడ్డపై ప్రస్తుతానికి అత్యధిక నెట్ వసూళ్లను సాధించిన మూవీగా కల్కి నిలిచింది. హిందీ మూవీ వెనక్కినెట్టి మన తెలుగు మూవీ నెం.1గా నిలిచింది. దాంతో నిన్న మెున్నటి వరకు టాలీవుడ్ అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు డార్లింగ్. వారి గడ్డపైనే కలెక్షన్ల వర్షం కురిపించి.. తెలుగోడి సత్తా ఏంటో చూపించాడు. మరి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ను వెనక్కినెట్టి మరీ.. అగ్రస్థానానికి దూసుకొచ్చిన ప్రభాస్ స్టామినా మీకేవిధంగా అనిపించిందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.