Dharani
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఆ వివరాలు..
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఆ వివరాలు..
Dharani
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా.. ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలయ్యింది. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ఏకంగా 215 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈక్రమంలో తాజాగా ఫైటర్ ఓటీటీ డీల్‌కు సంబంధించి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఇంతకు ఫైటర్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు ఎవరు సొంతం చేసుకున్నారు.. ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుంది అంటే..
ఫైటర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సైనట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 75 కోట్ల రూపాయలు చెల్లించి ఫైటర్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాక హోళీ పండుగ సందర్భంగా మార్చి చివరి వారంలో అనగా 29న ఫైటర్ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఫైటర్ మూవీ థియేటర్లలో కేవలం హిందీ వెర్షన్‌లో మాత్రమే రిలీజైంది. ఓటీటీలో మాత్రం హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఫైటర్ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఫైటర్ చిత్రంతో దీపికా, హృతిక్ రోషన్ తొలిసారి జంటగా నటించారు. సినిమాలో వీరి కెమిస్ట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో హృతిక్ రోషన్‌తో పాటు అనిల్ కపూర్, కరణ్ గ్రోవర్ సింగ్, కీలక పాత్రల్లో నటించారు. ఫైటర్ సినిమా తర్వాత హృతిక్ వార్ 2 మూవీ చేయబోతున్నాడు. దీనిలో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.
ఫైటర్ సినిమా ఆదివారం వరకు బాగానే కలెక్షన్స్ రాబట్టింది. వీకెండ్ ముగిసిన తర్వాత కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లో మాత్రమే భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వత వరసగా కలెక్షన్స్ డ్రాప్ అవుతూ సింగిల్ డిజిట్‌కు పరిమితం అవుతూ వస్తున్నాయి. అయినా సరే ఆరు రోజుల వ్యవధిలో ఫైటర్ సినిమా ఏకంగా 215 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి ఫైటర్ సినిమా మీరు చూశారు.. మీకు నచ్చిందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.