iDreamPost
android-app
ios-app

స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ – కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

  • Published Mar 06, 2024 | 9:19 PM Updated Updated Mar 06, 2024 | 9:19 PM

తొలి భాగం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రెండో భాగాన్ని నిర్మించాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్న విషయం తెలిసిందే.

తొలి భాగం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రెండో భాగాన్ని నిర్మించాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్న విషయం తెలిసిందే.

  • Published Mar 06, 2024 | 9:19 PMUpdated Mar 06, 2024 | 9:19 PM
స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ – కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో సీక్వెల్ హైప్ తో సినీ యూనివర్స్ లు తీయడం ఒక ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా బాక్సాఫీస్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాల్లో ఒకటి యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుండి వస్తున్న ‘వార్’ ఫ్రాంచైజీ. తొలి భాగం బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రెండో భాగాన్ని నిర్మించాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి నటించనున్న విషయం తెలిసిందే.

నిన్నటి నుండి బాలీవుడ్ మీడియా నుండి వార్ 2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రావడం మొదలైంది. ఈ సినిమా ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా నటించనున్నారు. అలానే వార్ ఫ్రాంచైజీ మాత్రమే కాకుండా స్పై యూనివర్స్ లోని ఇతర సినిమాల్లో కూడా అతిథి పాత్రలో కనిపిస్తారట. అలాగే ఆయన పాత్ర తీరుతెన్నులు చూపిస్తూ ప్రత్యేకంగా ఒక సినిమా కూడా ఉంటుందట. అయితే ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే బాలీవుడ్ స్టైల్ లో సాగే స్పై యాక్షన్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వవు అనే వాదన ఒకటి నెటిజన్లలో ఉంది. అందుకే అలాంటి జానర్ లో ఎన్టీఆర్ ఒక్క సినిమా చేయడం వరకూ పర్లేదు కానీ, మళ్ళీ మొత్తంగా స్పై యూనివర్స్ లోకి ఎంటర్ అవడం అనే వార్త అభిమానులను కాస్త కలవరపెడుతుంది. ఎన్టీఆర్ అంటే టాలీవుడ్ లోని టాప్ స్టార్ హీరోస్ లో ఒకరు. తెలుగు మార్కెట్ లో ఆయన సినిమాల పై ఒకరకమైన అంచనాలు ఉంటాయి. అలాంటిది హాలీవుడ్ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ ఉండే స్పై యూనివర్స్ సినిమాలలో ఆయన నటిస్తే అంతే ఆదరణ ఉంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే అభిమానుల్లో మరో వర్గం మాత్రం ఈ వార్తలలో ఆనందంగా ఉంది. బాలీవుడ్ లో సూపర్ స్టార్లు ఒకరి సినిమాల్లో మరొకరు క్యామియోలు చేయడం మంచి ట్రెండ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ అలాంటి క్యామియోలు చేయడం వల్ల ఆయన ఇమేజ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ స్పై యూనివర్స్ సినిమాల వల్ల ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో మార్కెట్ ను పెంచుకునే అవకాశం ఉన్న మాట కూడా వాస్తవమే కదా. తెలుగు మార్కెట్ లో ఆయనకు ఎలాగూ పెద్ద స్టార్ ఇమేజ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ అభిమానుల్లో కాస్త భయంలో ఉన్న వర్గానికి మిగతా వర్గం వారు భరోసా ఇస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఆగస్టులో వార్ 2 సినిమా విడుదల కానుంది. మరి ఎన్టీఆర్ తన అభిమానుల భయాన్ని పోగొట్టేలా ఒక భారీ బ్లాక్ బస్టర్ ఇస్తారని ఆశిద్దాం.

స్పై యూనివర్స్ – ఎన్టీఆర్ డేరింగ్ స్టెప్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom