సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్లి సందడి భామ శ్రీలీల ఎంపికైనట్టు ఫిలిం నగర్ టాక్. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2023 వేసవి టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఒత్తిడి హడావిడి లేకుండా మాటల మాంత్రికుడు ముందుకు వెళ్తున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అన్న సంగతి తెలిసిందే. […]
దేనికైనా సుడి ఉండాలని పెద్దలు ఊరికే అనలేదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇది చాలా అవసరం. శ్రీలీల ఆ సామెతకు మంచి ఉదాహరణగా నిలుస్తోంది. మొదటి చిత్రం సూపర్ ఫ్లాప్ అయినా అవకాశాలకు కొదవ లేకపోవడం అనూహ్యమే. పెళ్లి సందD ద్వారా రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో పరిచయమైన ఈ అమ్మాయి చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. రవితేజ ధమాకాలో తనే మెయిన్ హీరోయిన్. సీనియర్ హీరో సరసన జోడి కట్టాల్సి వచ్చినా […]
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేయనున్నారు. అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం F3 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొద్దిగా గ్యాప్ తీసుకొని బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా పూర్తయ్యేలోపు తన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తా అంటున్నాడు అనిల్ రావిపూడి. F3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్యతో తీయబోయే సినిమా గురించి, కథ గురించి […]
బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్న డార్లింగ్ ప్రభాస్ కు అర్జెంట్ గా ఇప్పుడో బ్లాక్ బస్టర్ కావాలి. సాహో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం, రాధే శ్యామ్ అన్ని భాషల్లోనూ డిజాస్టర్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలీవుడ్ మేకర్స్ మాయలో పడి తనను సరిగా వాడుకోవడం లేదని వాళ్ళ ఆవేదన. అందులో నిజం లేకపోలేదు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించాలనే ఉద్దేశంతో సబ్జెక్టులకు హిందీ స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడం […]